
ఈ శ్రమ్‌కు ఆదరణ కరువు
విజయనగరం గంటస్తంభం: అసంఘటిత రంగంలో కార్మికులు, వలస కార్మికులు, చిరు వ్యాపారులకు భరోసా కల్పించేందుకు కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ ఈ–శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించింది. దీంతో కార్మికుల సంక్షేమం కోసం వివిధ సామాజిక భద్రత పథకాలను మరింత మెరుగ్గా అమలు చేయడానికి వీలవుతుంది. కామన్ సర్వీస్ సెంటర్లలో కార్మికులు ఉచితంగా నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ పోర్టల్‌ను ప్రారంభించి ఏడాది గడిచినా..చాలా మంది దరఖాస్తు చేసుకోకపోవడంతో సంక్షేమ పథకాల హక్కులకు దూరమవుతున్నారు.
చేకూరే ప్రయోజనాలివి..
అసంఘటిత రంగంలో కార్మికులు ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకుంటే 12 అంకెలు కలిగిన ప్రత్యేక గుర్తింపు కార్డులు అందజేస్తారు. ఈ కార్డులు ఉన్నవారికే అన్ని రకాల సామాజిక భద్రత పథకాలు, సంక్షేమ పథకాలను వర్తింపజేస్తారు. ఇందులో నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు అంగవైకల్యం చెందితే రూ.ఒక లక్ష బీమాను ఉచితంగా అందజేస్తారు. అసంఘటిత రంగంలో కార్మికుల కోసం ప్రవేశపెట్టే పథకాల్లో నమోదు చేసుకున్న వారికి ప్రాధాన్య మిస్తారు. వలస కార్మికులు ఎక్కడ ఉన్నారో గుర్తించి ఉపాధి మార్గాలను చూపిస్తారు. కార్మికుడిగా నమోదైతే ప్రభుత్వమే తోడ్పాటు అందిస్తుంది. విపత్తులు సంభవించినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయకారిగా ఉంటుంది. ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడంలో చాలా మంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కొందరు మాత్రమే సద్వినియోగం చేసుకుంటున్నారు.
కొరవడిన అవగాహన..
ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు 10 లక్షల 90వేల మందికి పైగా కార్మికులు ఉండగా..ఇంకా 5 లక్షల పైచిలుకు మంది ఈ–శ్రమ్ నమోదు చేసుకోవాల్సి ఉంది. ప్రారంభంలో అధికారుల అవగాహన కార్యక్రమాలు, కార్మిక సంఘాల నేతల సూచనలతో నమోదు చేసుకునేందుకు కార్మికులు పోటీపడ్డారు. క్రమంగా ఈ–శ్రమ్ పోర్టల్‌కు ఆదరణ కొరవడుతోంది. సంక్షేమ పథకాల ఫలాలు కార్మికులందరికీ అందేలా కార్మిక సంఘాల నే తలు, అధి కారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కార్మికులు కోరుతున్నారు.
నమోదు ఉచితం
ఈ–శ్రమ్‌లో వివరాల నమోదుకు అనుసంధానమైన మొబైల్ నంబర్ నామినీ ఆధార్ వివరాలు అవసరం. సమీప గ్రామ, వార్డు సచివాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్‌సీ) లేదా కార్మికశాఖ కార్యాలయాల్లో సంప్రదిస్తే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితం. ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతా అయ్యాక యూఏఎన్ గుర్తింపు కార్డు జారీ అవుతుంది.
అసంఘటిత కార్మికులకు అండ
నమోదు కాని వారు ఉపాధి వేతనదారులే
సామాజిక భద్రత కోసం పోర్టల్ ఏర్పాటు
బీమా అందజేయనున్న కేంద్రప్రభుత్వం
అర్హులు వీరే..
16 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉండాలి
ఆదాయపు పన్ను పరిధిలోకి రానివారు
ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్‌ఓ), ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్(ఈఎస్‌ఐ)సదుపాయం లేనివారు
ఉద్యానవనాలు, నర్సరీలు, పాడి పరిశ్రమ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు టైలర్లు, డ్రైవర్లు, హెల్పర్లు, వీధి వ్యాపారులు, కల్లుగీత, రిక్షా కార్మికులు, చెత్త ఏరేవారు, కొరియర్ బాయ్‌లు, ఇళ్ల పనివారు, ఉపాధి వేతనదారులు, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, మధ్యాహ్న భోజనం వర్కర్లు, లోడింగ్,అన్ లోడింగ్ కార్మికులు, తదితరులందరూ ఈ పఽథకానికి అర్హులు.
అవగాహన కల్పిస్తున్నాం
ఈ–శ్రమ్ పథకంపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు ఆరుగురికి ప్రమాద బీమా పరిహారం రూ.2 లక్షలు చొప్పున అందజేశాం. ఒక ఇంటిలో ఎంతమంది ఉన్నా ఈ పథకానికి అర్హులే.
– ఎస్‌డీవీ ప్రసాదరావు, కార్మికశాఖ ఉప
కమిషనర్, విజయనగరం జిల్లా

ఈ శ్రమ్‌కు ఆదరణ కరువు

ఈ శ్రమ్‌కు ఆదరణ కరువు

ఈ శ్రమ్‌కు ఆదరణ కరువు