
ఏపీ క్రెడయ్ చాప్టర్‌లో చంద్రబోస్‌కి కీలక బాధ్యతలు
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రెడయ్ చాప్టర్ నూతన కార్యవర్గ ఎన్నికలో విజయనగరం జిల్లాకు చెందిన కట్టూరు సుభాష్ చంద్రబోస్ కీలక బాధ్యత లు చేపట్టారు. మంగళవారం విజయవాడలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమక్షంలో 2025–27 సంవత్సరాలకు సంబంధించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా విజయనగరానికి చెందిన సుభాష్ చంద్రబోస్ క్రెడయ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అదేవిధంగా క్రెడయ్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కన్వీనర్‌గా, జీఎస్టీ కన్వీనర్‌గా, సెంటర్ జోన్ ఇంచార్జ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరానికి చెందిన తనకి క్రెడయ్ ఏపీ చాప్టర్‌లో కీలక బాధ్యతలు అప్పగించటం సవాల్‌గా స్వీకరిస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్‌లో నిర్మా ణ రంగం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొ న్నారు. వ్యవసాయం తరువాత అధికంగా ఉపాధి పొందే నిర్మాణ రంగంలో పూర్తి స్థాయిలో సేవలందిస్తానని చెప్పారు. నిర్మాణ రంగ కార్మికుల నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేలా ముందుకు వెళతానన్నారు. కార్మి కులకు గుర్తింపు కార్డులు మంజూరు చేస్తామన్నారు.