
పార్వతీపురంటౌన్: ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఆపదలో ఉన్నవారిని మానవతా దృక్పథంతో ఆదుకుంటోంది. ఆర్థిక చేయూతను అందిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి అందుబాటులోకి తెచ్చిన ఆరోగ్య శ్రీ, 108, 104 సేవలను మరింత మెరుగుపరిచింది. పేదల ఆరోగ్యానికి ఓ వైపు పెద్దపీట వేస్తూనే, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛన్ రూపంలో ఆర్థిక భరోసా కల్పిస్తోంది. వైఎస్సార్ హెల్త్ పెన్షన్ పథకం కింద వ్యాధిని బట్టి నెలకు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రతి నెలా ఠంచన్‌గా అందజేస్తోంది.
పింఛన్ మంజూరు ఇలా...
జిల్లాలో వైఎస్సార్ హెల్త్ పెన్షన్ దరఖాస్తులను ఉన్నతాధికారులు పరిశీలించి నిజమైన అర్హులుగా తేల్చాక పింఛన్ మంజూరు చేస్తున్నారు. 2020లో ప్రారంభమైన వైస్సార్ హెల్త్ పెన్షన్ పథకాన్ని జిల్లాలోని 663 మంది అందుకుంటున్నారు. ప్రస్తుతం మరో 270 దరఖాస్తులు అప్‌లోడ్‌చేశారు. కుష్టు వ్యాధి గ్రస్తులకు నెలకు రూ.3 వేలు పింఛన్ ఇస్తుండగా కిడ్నీ, లివర్, గుండె రీప్లేస్మెంట్ జరిగిన రోగులకు, కిడ్నీ బాధితులు (సీరంక్రియాటిన్ 5 ఎంఎం కంటే ఎక్కువ) ఉన్న వారికి, తీవ్రంగా కండరాల క్షీణతతో పాటు ప్రమాదాలతో మంచానికి, వీల్ చైర్‌కు పరిమితమైన వారికి, చక్రాల కుర్చీ, మంచానికి పరిమితమైన పక్షవాతం ఉన్నరోగులకు, బోదకాలు (రెండు కాళ్లకు) ఉన్న వారికి నెలకు రూ.5వేలు పింఛన్ అందజేస్తున్నారు. తలసేమియా మేజర్, సికి ల్సెల్, సివియర్ హిమోఫీలియా (2 శాతం పైబడి) ఉన్న రోగులకు నెలకు రూ.10 వేలు అందజే స్తున్నారు. పక్షవాతం, కండరాల క్షీణత, ప్రమాదాలతో మంచానికి పరిమితమైన రోగులకు సదరంసరిఫికేట్ ఆధారంగా పెన్షన్ మంజూరు చేస్తున్నారు.
దరఖాస్తు ఇలా...
దరఖాస్తు దారులకు ముందుగా మెడికల్ బోర్డులోని కమిటీ రోగ నిర్ధారణ చేస్తుంది. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని డాక్టర్లు సోషల్ ఆడిట్ చేసి వ్యాధి నిర్ధారణ చేస్తారు. దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని రోగులకు అందజేస్తారు. దీనికి ఆధార్, బియ్యం కార్డు, బ్యాంకు ఖాతా పాసుపుస్తకం జిరాక్స్‌ను జతచేసి డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోని వైఎస్సార్ హెల్త్ పెన్షన్ విభాగంలో దరఖాస్తు అందజేయాలి. దరఖాస్తులను డైరెక్టర్ ఆఫ్‌హెల్త్‌కు అప్లోడ్ చేస్తారు. అక్కడి నుంచి పింఛన్ మంజూరు పత్రాలు సచివాలయాలకు చేరుతాయి. దాని ప్రకారం వలంటీర్లు బాధితులకు పెన్షన్ అందజేస్తారు.
ఆర్థిక ఆసరా..
దీర్ఘకాలిక అనారోగ్యం, ప్రమాదాలతో నడవలేని పరిస్థితిలో సాధారణ జీవనం గడపలేనివారికి ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ పెన్షన్ ద్వారా ఆర్థిక ఆసరా కల్పిస్తోంది. ప్రభుత్వం తలపెట్టిన పెన్షన్ పథకం నిజమైన రోగులకు అందజేసేందుకు కృషిచేస్తున్నాం. వ్యాధి నిర్ధారణలో అవకతవకలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటున్నాం.
– కిరణ్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ,
పార్వతీపురం మన్యం
పార్వతీపురం పట్టణంలో 19వ వార్డులో
లబ్ధిదారు ఊన్న భాస్కరరావుకు
పింఛన్ అందజేస్తున్న వలంటీర్ కుమార్ (ఫైల్)
పట్టణంలోని వైకేఎం కాలనీలో లబ్ధిదారు డి. ప్రభావతికి పింఛన్ అందజేస్తున్న వలంటీర్ కుమార్ (ఫైల్)
న్యూస్‌రీల్
గత ప్రభుత్వంలో కేవలం రూ.3వేలు మాత్రమే
వైఎస్సార్ ప్రభుత్వం వచ్చాక 9 రకాల వ్యాధిగ్రస్తులకు పింఛన్లు
వ్యాధి తీవ్రతను బట్టి నెలకు రూ.3వేల నుంచి రూ.10వేలు
అనారోగ్యంతో ఉన్నవారికి ప్రభుత్వం ఆర్థిక చేయూత
జిల్లాలో 663 మందికి ప్రతినెలా రూ.47.83 లక్షల లబ్ధి



కలెక్టర్ నిషాంత్‌కుమార్‌కు మిఠాయిని తినిపిస్తున్న జేసీ గోవిందరావు

నెహ్రూ వర్ణచిత్రం

తులసిరామినాయుడువలస పరిసరాల్లోసంచరిస్తున్న ఏనుగులు
