
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి
సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందిన సంఘటన సత్తెనపల్లి మండలం నందిగామ, గుడిపూడి పొలిమేర వద్ద శుక్రవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మోదుగుల రమాదేవి (62) సత్తెనపల్లిలో అల్లుడు పంచుమర్తి శ్రీనివాసరావు వద్దకు వచ్చి తిరిగి లక్ష్మీపురం గ్రామం వెళ్లేందుకు అల్లుడు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా నందిగామ, గుడిపూడి పొలిమేర వద్ద కుక్క అడ్డు రావడంతో ద్విచక్ర వాహనం పడిపోయింది. రమాదేవికి, అల్లుడు శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. రమాదేవి తలకు బలమైనగాయం కావడంతో హుటాహుటిన సత్తెనపల్లి ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా అప్పటికే రమాదేవి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి భర్త సాంబశివ రావు, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రమాదేవి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.