
రాజ్‌భవన్‌లో వన మహోత్సవం
భువనేశ్వర్: వన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఏక్ పెడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా శనివారం రాజ్ భవన్ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామానంద పార్క్‌లో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి మొక్క నాటి నీరు పోశారు. రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, రాజ్ భవన్ ప్రాంగణంలో అనేక మొక్కలు నాటారు. గవర్నర్ మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన మరియు పచ్చటి వాతావరణం అందించేందుకు వ్యక్తులు, సంస్థలు ఉత్సాహంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.