
నదిని దాటాల్సిందే..!
చదువు సాగాలంటే..
అక్షరాలు నేర్చుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు అక్కడి గిరిజన విద్యార్థులు. చదువుకోవాలనే ఆశయంతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదిని నడుకుంటూ దాటుతున్నారు. కొరాపుట్ జిల్లా దశమంత్‌పూర్ సమితి పిండాపొదర్ గ్రామ పంచాయతీ శేషకుడి గ్రామ ప్రజలు అంధారి నది దాటుతున్న దృశ్యమిది. గత వారం రోజులుగా వర్షాలు వలన పిల్లలు చదువులకు వెళ్లలేకపోయారు. ఇలా అయితే తమ పిల్లలు తమలాగే వెనుకబాటుతనానికి గురవుతారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చిన్నారులను తమ భుజాల మీద కూర్చొనబెట్టి ప్రమాదకర పరిస్థితిలో నదిని దాటించారు. ఈ గ్రామంలో 280 మంది జనాభా నివసిస్తున్నారు. దీంతో నదిపై వంతెన నిర్మాణం చేపట్టాలని దశాబ్దాలుగా పాలకులను వేడుకుంటున్నా తమ మొర వినడం లేదని వాపోతున్నారు. కనీసం పాద వంతెన నిర్మించినా తమ ప్రాణాలకు భద్రత ఉంటుందని పేర్కొన్నారు. ఇలాగే ప్రతిరోజు రెండు పూటలు గిరిజనులు పిల్లలను పాఠశాలకి పంపించడం, తీసుకొని రావడం చేస్తున్నారు. అదేవిధంగా గ్రామస్తులు కూడా తమ జీవనోపాధి కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని నదిని దాటుతున్నారు.
– కొరాపుట్

నదిని దాటాల్సిందే..!