
ఉత్తర ఒడిశాలో వరద ఉధృతి
● ఏరియల్ సర్వే నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి
భువనేశ్వర్: ఉత్తర ఒడిశాలో ఎడతెరిపి లేని వానలతో పలు నదులు ఉప్పొంగాయి. జనావాసాలు వరద నీటిలో మునిగాయి. ఒడ్రాఫ్, తదితర వర్గాల సకాల సహాయ, సహకారాలతో చిరు ప్రమాదాలు మినహా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. గురువారం ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రధానంగా బాలాసోర్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షించారు. భొగొరాయి, బలియాపాల్, బొస్తా, జలేశ్వర్, బాలాసోర్ సదర్, రెముణ తదితర ప్రాంతాల్ని సందర్శించారు. ఈ జిల్లాలోని 6 మండలాల్లో 154 గ్రామాలు, జలేశ్వర్ మునిసిపాలిటీలోని 8 వార్డులు వరద నీటితో ప్రభావితమైనట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించి ఆశ్రయంతోపాటు ఆహారం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సహాయక, పునరుద్ధరణ కార్యకలాపాల కోసం ఒడ్రాఫ్, అగ్నిమాపక దళాలను నియమించారు.
కెంజొహర్ జిల్లాలో వరద ఉధృతి
కెంజొహర్ జిల్లా జోడా కాన్‌పూర్ ప్రాంతంలో తాత్కాలిక మట్టి కట్ట తెగడంతో వరద నీరు జనావాస ప్రాంతాల్లోకి వెళ్లింది. ఎటువంటి హాని జరగకుండా సత్వర చర్యలు చేపట్టినట్లు ఆనకట్ట చీఫ్ ఇంజినీర్ తెలిపారు.

ఉత్తర ఒడిశాలో వరద ఉధృతి

ఉత్తర ఒడిశాలో వరద ఉధృతి

ఉత్తర ఒడిశాలో వరద ఉధృతి