
అలరించిన గుహారి
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని రథయాత్ర సందర్భంగా కొనసాగుతున్న గుహారి భక్తి, ఆధ్యాత్మిక సంగీత ఉత్సవం శ్రోతలను మంత్రముగ్దులను చేసింది. స్థానిక ఉత్కళ రంగస్థలంపై ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతిశాఖతో కలిసి గురు కేలూ చరణ్ మహాపాత్రో ఒడిస్సీ పరిశోధన కేంద్రం ఈ ఉత్సవం నిర్వహించింది. జగన్నాథుని ఆధారంగా రూపొందించిన గాయకుల భక్తి సంగీత ప్రదర్శన ఉత్సవంలో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. గాయకులు మహాప్రసాద్ కొరొ, అనుసూయ నాథ్, బసంత పాత్రో, సృష్టి సురూప, అలోక్ కుండు, నిషి ప్రభ పాణి, ప్రభాత్ కుమార్ పాత్రో, దీప్తి దా్‌స్, దిబ్యరంజన్ దాస్ జగన్నాథునిపై ఆధారిత భుజ తాళే, అహే నీలగిరి, దుఃఖ నాశన హే, ఏహి కఠారే మో మన, మొన్నొ రే హరి భజన, పతితపావన బన్నా, రాధా శ్రీపాద బ్రజా, జై జగబంధు హే జాదు నందన, జై జై జగన్నాథ్ తదితర భక్తి గీతాలు ఆలపించారు. దుష్మంత్ కుమార్ పరిడా (తబలా), వైభవ కుమార్ దాస్ (డ్రమ్), ప్రీతి రంజన్ స్వంయి (వేణువు), సుధాంశు శేఖర్ జెనా (ఆక్టోపాడ్), చింతామణి మిశ్రా (కీబోర్డ్), సుమంత మహరణ (హార్మోనియం) వాద్య సహకారం అందజేశారు. ప్రముఖ గాయని పద్మశ్రీ శ్యామ మణి దేవి, ఒడిస్సీ నృత్యకారిణి పద్మశ్రీ కుంకుమ్ మహంతి, ప్రఖ్యాత గాయని గీతా పట్నాయక్, ప్రముఖ పండితుడు డాక్టర్ కీర్తన్ నారాయణ్ పర్హి, జీకేసీఎం ఒడిస్సీ రీసెర్చ్ సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనుజా తరిణి మిశ్రా అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమానికి డాక్టర్ మృత్యుంజయ రథ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

అలరించిన గుహారి

అలరించిన గుహారి

అలరించిన గుహారి