
పురుగుల మందు తాగి మహిళ మృతి
మల్కన్‌గిరి: జిల్లాలోని పోడియా సమితి నీలిగూడ పంచాయతీ ధర్మపల్లి గ్రామంలో కాళి మడ్కమి (38) అనే మహిళ పురుగుల మందు తాగి దుర్మరణం పాలైంది. వివరాల్లోకి వెళ్తే.. కాళి గత కొన్ని నెలలుగా మానసిక స్థిరత్వం కోల్పోయి గ్రామంలో తిరుగుతోంది. పొలం కోసం తెచ్చిన పురుగుల మందును ఇంటి వద్ద ఒకచోట కుటుంబ సభ్యులు దాచారు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ మందును తాగిపడిపోయింది. అనంతరం గమనించి కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ధర్మాపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలియజేశారు. దీంతో వెంటనే మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ కాళి మంగళవారం ఉదయం మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న పోడియా ఏఎస్‌ఐ కేశవబత్రా మల్కన్‌గిరి వచ్చి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆమె మృతిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.