
● గుండిచా మందిరం మెరిసేలా..
జయపురం: జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవతా మూర్తులు రథాయాత్ర సందర్భంగా జయపురంలోని గుండిచా మందిరం (బంకమఠం)లో విడిది చేసి ఉన్న దేవతా మూర్తులను తిలకించి పూజలు చేసేందుకు వేలాది మంది భక్తులు వస్తున్నారు. దీంతో పారిశుద్ధ్యం లోపించకుండా గుండిచా మందిర ప్రాగణాన్ని జమాల్ లైన్ శ్రీరామ కమిటీ అధ్యక్షులు గోరపల్లి నాగరాజు నేతృత్వంలో మందిర పరిసరాలను కమిటీ సభ్యులు, గుండిచా మందిరాన్ని తుడిచి, కడిగి పరిశుభ్ర పరుస్తున్నారు. రథాయాత్ర సమయంలో జమాల్ లైన్ శ్రీరామ మందిర పరిశీలన కమిటీ సభ్యులు గుండిచా మందిరం ప్రాంతాన్ని పరిశుభ్రం చేస్తున్నట్టు నాగరాజు వెల్లడించారు. ఆదివారం నుంచి రోజూ ఉదయం ఆరు గంటలకు శ్రీరామ మందిర పరిశీలన కమిటీ సభ్యులు వచ్చి గుండిచా మందిర పరిసరాలన చీపుర్లతో తుడుస్తూ వ్యర్ధ పధార్ధాలను తొలగించి వాటిని పారవేసున్నట్లు వెల్లడించారు. ఈ నెల ఐదో తేదీ వరకు సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. కాగా శ్రీరామ మందిర కమిటీ సభ్యులు చేస్తున్న సేవలను భక్తులు ప్రశంసిస్తూ అభినందిస్తున్నారు. పనులను పూజారి గన్నవరపు కోటేశ్వరశర్మ పర్యవేక్షిస్తున్నారు.
అభినందనలు అందుకుంటున్న శ్రీరామ మందిర కమిటీ సభ్యులు