
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి తెల్‌రాయ్ పంచాయతీకి రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కలిమెల నుంచి మోటు వైపు బైక్ వెళ్తుంది. వెనుక నుంచి ట్రక్కును ఢీకొంది. బైక్‌పై ఉన్న వ్యక్తి రోడ్డు పక్కన రాళ్లపై పడిపోయాడు. ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు కలిమెల పోలీసులకు సమాచారం ఇచ్చారు. కలిమెల ఐఐసీ ముకుందో మేల్క ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు ఎక్కడ నుంచి వస్తున్నాడో తెలియలేదు. గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. మృతదేహన్ని కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సోమవారం ఎవరైనా మృతదేహం కోసం వస్తే పోస్టుమార్టం పూర్తిచేసి అప్పగిస్తామని ఐఐసీ తెలిపారు.
వ్యాన్‌ఢీ కొని..
కొరాపుట్: కొరాపుట్ జిల్లా లమ్తాపుట్ సమితి కొంచనా గ్రామం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. భారీ వర్షంలో వ్యాన్ వస్తుంది. అదే సమయంలో ఓ యువకుడు (30) చెట్టు కింద తన బైక్ ఆపి నిల్చున్నాడు. వ్యాన్ అదుపు తప్పి ఆ యవకుడిని ఢీకొంది. సంఘటన స్థలంలోనే యువకుడు మృతి చెందాడు. వ్యాన్ కూడా అదుపు తప్పి బోల్తాపడింది. వెంటనే లమ్తాపుట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు నందపూర్ సమితి పడేల్ గ్రామ వాసిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని..
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా రాయిఘర్ సమితి పారువా గ్రామ పంచాయతీ ఇంద్రానగర్ వద్ద ఆదివారం సాయంత్రం జగిరిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. స్కూటిని గుర్తుతెలియని వాహనం ఢీకొని వెళ్లిపొయింది. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రాయిఘర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతని వద్ద ఎటువంటి ఆధారాలు లేవు. మృతదేహాన్ని రాయిఘర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి