
విక్రమదేవ్ వర్మకు ఘన నివాళి
జయపురం: బహుముఖ ప్రజ్ఞాశాలి, ఉత్కళాంధ్ర వారధి జయపురం మహారాజు సామ్రాట్ విక్రమదేవ్ వర్మ అని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. విక్రమ దేవ్ వర్మ 157వ జయంతి ఉత్సవాల సందర్భంగా.. ఇంటాక్ కొరాపుట్ చాప్టర్ సహకారంతో స్థానిక శ్రీ విక్రమ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన ‘సిటీ ఆఫ్ విక్టరీ జయపుర’ ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విక్రమదేవ్ వర్మ ప్రత్యేక ఒడిశా ఉద్యమంలో చిరస్మరణీయ భూమిక నిర్వహించారని గుర్తు చేశారు. ‘సిటీ ఆఫ్ విక్టరీ జయపుర’ ఫొటో ప్రదర్శనను కౌన్సిల్ ఆఫ్ అనాలిటికల్ ట్రైబల్ స్టడీస్ కొరాపుట్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ పరేష్ రథ్ నిర్వహించారు.

విక్రమదేవ్ వర్మకు ఘన నివాళి

విక్రమదేవ్ వర్మకు ఘన నివాళి

విక్రమదేవ్ వర్మకు ఘన నివాళి