
నయన పథగామి
శనివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2025
జగన్నాథ స్వామీ..
దేవదేవుడు గర్భగుడి వదిలి భక్తుల వద్దకు తరలివచ్చాడు. కోవెల పరిసరాలను పావనం చేస్తూ రథాన్ని అధిరోహించాడు. కడలి ఘోషతో పోటీ పడుతూ సాగిన భక్తుల జయ జయ ధ్వానాల నడుమ సుభద్ర, బలభద్ర సమేతుడై గుండిచాకు బయల్దేరాడు. గుండె గొంతుగా చేసుకొని జనం జయహో జగన్నాథ అని కీర్తిస్తుంటే.. చిరు మందహాసుడై ఆలకించాడు. ప్రేమగా రథాన్ని లాగుతుంటే అంతటి గొప్ప దేవుడు అవలీలగా ముందుకు కదిలాడు. నేత్రోత్సవం, నవ యవ్వన సేవతో అలసినా భక్తుల కోసం కొంతదూరం కదిలి, మిగిలిన దూరం మరుసటి రోజు వెళ్దామని సందేశమిచ్చాడు. – భువనేశ్వర్
భక్తుల కోసం తరలివచ్చే భగవంతుని దర్శనానికి ఆశేష ప్రజానికం పోటెత్తారు. దీంతో జై జగన్నాథ్ నినాదంతో శ్రీక్షేత్రం మారుమోగింది. భగవంతుని సమక్షంలో హెచ్చు తగ్గులకు తావులేదని రథయాత్ర ప్రత్యక్షంగా ప్రతిబింబిస్తుంది. భక్తికి మించిన శక్తి వేరొకటి లేదని సర్వ జనులు భుజం భుజం కలిపి నింగికి ఎగసే మూడు భారీ రథాలను అవలీలగా గమ్యం చేర్చడం భగవంతునిపై విశ్వాసాన్ని బలపరుస్తుంది. కృత్రిమ మేధస్సుకు ధీటుగా సహజమైన భక్తిభావంతో సాక్షాత్తు జగతినాథుని రథానికి సాధారణ ప్రజలు యాంత్రిక, సాంకేతిక స్పర్శ లేకుండా నిరాటంకంగా ముందుకు లాగి సురక్షితంగా గమ్యం చేర్చడం అత్యద్భుత ఘట్టంగా అబ్బురపరుస్తుంది. సోదర, సోదరితో కూడి బయల్దేరిన శ్రీజగన్నాథుని రథయాత్రలో తరతరాలుగా సేవలందిస్తున్న వంశీకుల వారసులు, అనంత భక్తజనం ఆద్యంతం ప్రత్యక్ష పాత్రధారులుగా తారసపడతారు. ఇదే తరహాలో ఈ ఏడాది జరిగిన యాత్రలో వంశపారంపర్యంగా స్వామి కార్యంలో పాలుపంచుకుంటున్న వడ్రంగి, కమ్మరి వంటి సేవకులు రథాలను తయారు చేయగా.. దర్జీ, చిత్రకారులు, రూపకారులు ఆకర్షణీయంగా రథాలను తీర్చిదిద్దారు. భక్తజనం గుండిచా మందిరం వైపు యాత్రని సజావుగా నిర్వహించి మనమంతా ఒక్కటే, జగన్నాథుడు మనందరి వాడేనన్న సరళమైన భావనతో యాత్రని మేటిగా నిర్వహించారు.
మార్మోగిన ఘంటానాదం
తరంగ ధ్వనితో మారుమోగిన ఘంటానాదం మధ్య సువిశాల పుష్ప మకుట అలంకరణతో మూల విరాటులు వరుస క్రమంలో తరలి వచ్చి రథాల్లో ఆశీనులయ్యారు. రక్షకుడిగా సుదర్శనుడు ముందుగా బయల్దేరి సుభద్ర దేవి రథంలో ఆశీ
నేడు పునరారంభం
భువనేశ్వర్: యాత్రలో వరుస క్రమంగా బయల్దేరిన మూడు రథాలు సకాలంలో గమ్యం చేరలేకపోయాయి. శ్రీమందిరం, శ్రీగుండిచా మందిరం మధ్యమార్గంలో నిలిచి పోయాయి. ఆచారం ప్రకారం చీకటి పడిన తర్వాత రథాలు లాగడం నిలిపివేయడం అనివార్యమైంది. శుక్రవారం సాయంత్రం 7.41 గంటలతో రథాలు లాగడం నిలిపివేశారు. బాలగండి చౌరస్తాలో బలభద్రుని తాళధ్వజం, మారీచ్‌కోట్ కూడలి ప్రాంతంలో దేవీ సుభద్ర రథం దర్ప దళనం, శ్రీజగన్నాథుని నంది ఘోష్ రథం శ్రీమందిరం సింహద్వారం దగ్గరే నిలిచిపోయింది. అనివార్య కారణాలతో ఈ రథం లాగడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. చీకటి పడడంతో లాంచనంగా లాగి నిలిపి వేశారు.
ఉదయం 9.30 గంటలకు...
మార్గమధ్యలో నిలిచిన రథాలను శనివారం ఉదయం 9.30 గంటలకు లాగడం ప్రారంభిస్తారని శ్రీమందిరం ప్రధాన పాలన అధికారి(సీఏవో) డాక్టర్ అరవింద కుమార్ పాఢి తెలిపారు. అంతవరకు నిత్య, దైనందిన, యాత్ర పూజాదులు రథాలపై యథాతథంగా కొనసాగుతాయి. భక్తులు నిరవధికంగా రథాలపై దేవుళ్లని దర్శించుకునేందుకు వీలవుతుందన్నారు.
స్వామి సేవలో ప్రముఖులు
శ్రీజగన్నాథుని రథయాత్రలో అంతా సమానమే. అతిరథ మహారథులు సాధారణ భక్తజనంతో కలిసిమెలిసి స్వామి రథంలాగి పుణీతం కావాలని పరితపిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాల్లో అదే తరహాలో పాల్గొని ఉత్సాహపరుస్తారు. ఈ ఏడాది జరిగిన రథయాత్రలో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు దంపతులు, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝితో పాటు పలువురు కేంద్ర, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు తదితర ప్రముఖులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
నుడు అయ్యాడు. దీంతో మార్గం సుగమం ఖరారు సంకేతంగా భావించి బలభద్ర స్వామి బయల్దేరి తాళ ధ్వజంలో చేరాడు. అనంతరం సుభద్ర తన రథంలోకి చేరింది. అన్నా, చెల్లెలు ఉత్సాహంతో రథాల్లోకి చేరడంతో ఉవ్విళ్లూరుతున్న భక్తజనం మధ్యలోకి సుగంధ భరిత శ్రీజగన్నాథుడు నందిఘోష్ రథం అధిరోహించడంతో యాత్ర ప్రాంగణం హరీ భోల్.. జై జగన్నాథ్ నినాదాలతో శ్రీక్షేత్రం కంపించింది. మూల విరాటులు యాత్ర కోసం రథాల్లో చేరడంతో ఉత్సవమూర్తులు మదన మోహనుడు, రామకృష్ణులు తోడుగా చేరారు. వీరంతా చేరడంతో రథాలు కదిలే దేవాలయాలుగా తేజోవంతం అయ్యాయి. ఆది శంకరాచార్యులు, గోవర్ధన పీఠాధిపతి స్వామి నిశ్చలానంద సరస్వతీ రథాలపై దేవుళ్లకు తొలి దర్శనం చేసుకుని భక్త జనాన్ని ఆశీర్వదించారు. యాత్రకు బయల్దేరే ముం
దు రథాల్లో దేవుళ్లకు ఎటువంటి అశుచి ఆవహించకుండా తొలి సేవకునిగా పూరీ గజపతి మహారాజా దివ్య సింగ్‌దేవ్ రాజ పురోహితుల ప్రత్యక్ష పర్యవేక్షణలో బంగారు పిడి కలిగిన చీపురుతో మూడు రథాలను ఊడ్చి పవిత్ర జల సించనంతో సుగంధిత పుష్పాలు విరజిమ్మి స్వచ్ఛతని నికరం చేయడంతో రథాల కదలిక కోసం యంత్రాంగం రంగంలోకి దిగింది. రాజావారి సేవ పూర్తి కావడంతో రథాలకు సారథులు, కొయ్య గుర్రాలను అమర్చారు. ఘంటకులు ఇతరేతర వర్గాల వంశపారంపర్య సేవక వర్గం రథాలపైకి చేరి ఘంటానాదం ఆరంభం కావడంతో భక్తజనం ఊపందుకుంది. అన్నా చెల్లెళ్ల రథాల వెంబడి నంది ఘోష్ రథంలో శ్రీజగన్నాథ స్వామి చివరగా బయల్దేరాడు. రథయాత్ర తొలి ఘట్టం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. గుండిచా మందిరం అడపా మండపానికి మూల విరాటులు వెళ్లేంత వరకు దైనందిన నిత్య సేవలను రథాలపై యథాతథంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.
శ్రీజగన్నాథుడు అందరివాడు. కుల, మత, వర్గ, వర్ణ విభేదాలకు అతీతంగా సర్వ జనులను కటాక్షించే ప్రత్యక్ష దైవం. యావత్తు భక్తజనం ఏక కాలంలో జై జగన్నాథ్ నినాదంతో ప్రార్థిస్తారనేదానికి ఈ చిత్రం నిలువెత్తు సాక్ష్యం. – భువనేశ్వర్/పూరీ
పూరీ తీరం.. భక్తజన సంద్రం వైభవంగా జగన్నాథ రథయాత్ర కనులారా స్వామిని చూసి తరించిన భక్తజనం

నయన పథగామి

నయన పథగామి

నయన పథగామి

నయన పథగామి

నయన పథగామి

నయన పథగామి

నయన పథగామి