
చోరీ కేసులో నిందితులు అరెస్టు
రాయగడ: ఒక చోరీ కేసుకు సంబంధించి జిల్లాలోని అంబొదల పోలీసులు 11 మంది నిందితులను అరెస్టు చేశారు. అంబొదల పోలీస్‌స్టేషన్ పరిధి జగదల్‌పూర్ ప్రాంతంలోని ఒక క్రషర్‌లో ఇటీవల చోరీ జరిగింది. ఈ చోరీ కేసు లో నిందితులను పట్టుకున్న పోలీసులు వారి నుంచి నాలుగు ఇనుప పైప్‌లు, గ్యాస్ కట్టర్లు, మూడు ఆక్సిజన్ సిలెండర్లు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులను గురువారం కోర్టుకు తరలించారు.
ఎడతెరిపి లేని వర్షం
● కొట్టుకుపోయిన రోడ్డు
జయపురం: కొరాపుట్ జిల్లాలో కొద్ది రోజులు గా ఎడతేరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నా యి. దీంతో జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుగడ సమితి చిపాకూర్ పంచాయతీ ప్రధాన మార్గంలోని కిర్షాల గ్రామ సమీపంలో నిర్మించి న కల్వర్టు, రోడ్డు కొట్టుకుపోయాయి. 6 నెలల క్రితం నిర్మించిన కల్వర్టు కూలిపోగా, తారురోడ్డు కొట్టుకుపోయింది. వీటిపై ఆధారపడి సుమారు 6 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే కల్వర్టు కూలిపోవడంతో ప్రస్తుతం ఆయా గ్రామాలకు సమితి కేంద్రాల తో సంబంధాలు దెబ్బతిన్నాయి. కాగా నాణ్య తా ప్రమాణాలు పాటించకపోవడం వలనే కొట్టుకుపోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నా రు. రూరల్ డవలప్‌మెంట్ అధికారులు తక్షణ మే చర్యలు తీసుకొని రోడ్డు పునరుద్ధరించాలని కోరుతున్నారు.
డివైడర్‌ను ఢీకొన్న ట్యాంకర్
రాయగడ: స్థానిక కపిలాస్ కూడలి వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి దిగుతున్న ట్యాంకర్ అదుపుతప్పి ఎదురుగా ఉన్న డివైడర్‌ను ఢీకొంది. శుక్రవారం వేకువజామున ఈ ఘటన చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి బ్యాక్ ఆయ ల్ లోడ్‌తో జాజ్‌పూర్ వైపు వెళ్తున్న ట్యాంకర్ స్థానిక కపిలాస్ కూడలి వద్ద ఫ్లైఓవర్ దిగుతు న్న సమయంలో ఎదురుగా వస్తున్న ఒక ఆటోని తప్పించబోయి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ సంతోష్ కుమార్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచా రం తెలుసుకున్న సదరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు.
సీఎం మోహన్ చరణ్
రాజీనామా చేయాలి
జయపురం: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, అల్పవర్గాల ప్రజలు, దళితులపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని భారతీయ కమ్యూనిస్టు పార్టీ కొరాపుట్ జిల్లా శాఖ ఆరోపించింది. అత్యాచారాలు అరికట్టలేని సీఎం మోహన్‌చరణ్ మాఝీ రాజీనామా చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జయంతి దాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జయపురం ప్రధాన కూడలి వద్ద నిరసన చేపట్టారు. ఆందోళనలో రాష్ట్ర సీపీఐ కార్యవర్గ సభ్యుడు, కార్మిక నేత ప్రమోద్ కుమార్ మహంతి, సీపీఐ జిల్లా కార్యదర్శి జుధిష్టర రౌలో, సహాయ కార్యదర్శి కుమార్ జాని, జిల్లా మాజీ సహాయ కార్యదర్శి రామకృష్ణ దాస్, సత్యభ్రత నందో, నంద హరిజన్, బలభధ్ర బోయి, పవన మహుళియ, ఘాశీరాం సాహు తదితరులు పాల్గొన్నారు.
అపురూప అవకాశం
● గవర్నర్ హరిబాబు కంభంపాటి
భువనేశ్వర్: పూరీ శ్రీజగన్నాథ స్వామి వార్షిక రథయాత్రలో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి దంపతులు పాల్గొన్నారు. ఇదో అపురూప అవకాశమని పేర్కొన్నారు. బొడొ దండొలో జై జగన్నాథ నినాదాల మధ్య రథా లు కదులుతున్న దృశ్యం ప్రజల భక్తిశ్రద్ధల అపూర్వ సంగమంగా హృదయాన్ని హత్తుకుందన్నారు. దైవ చింతనలో ఐక్యత మరియు విశ్వాసం మమేకం కావడం శ్రీజగన్నాథుని లీలగా తన్మయత్వం వ్యక్తం చేశారు. శ్రీజగన్నా థుని రథయాత్ర ఆనందకరమైన భక్తి వాతావరణ ఆవిష్కరణకు నాందిగా పేర్కొన్నారు.
సుదర్శనుని పొహండి
భువనేశ్వర్: యాత్రలో రక్షకునిగా సుదర్శనుని స్థానం అత్యంత కీలకం. మూల విరాటుల కంటే ముందుగా సుదర్శనుడు శ్రీమందిరం నుంచి బయటకు తరలివచ్చి రథంపై ఆసీనుడు అయ్యాడు. ఆయన చతుర్థామూర్తిగా మూల విరాటుల సరసన నిత్యం దర్శనం ఇస్తాడు. సుభద్ర దేవి రథంలో రక్షకునిగా యాత్ర కొనసాగిస్తాడు.

చోరీ కేసులో నిందితులు అరెస్టు