క్రికెటర్ ఖాజా మొహిద్దీన్‌కు కేడీసీఏ అభినందనలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆల్ ఇండియా యూనివర్సిటీ క్రికెట్ జట్టులో ఎంపికైన కృష్ణా జిల్లాకు చెందిన క్రికెటర్ ఖాజా మొహిద్దీన్‌ను కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ (కేడీసీఏ)సెక్రటరీ రవీంద్ర చౌదరి అభినందించారు. నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో క్రికెట్ నెట్ ప్రాక్టీస్‌కు వచ్చిన ఖాజా మొహిద్దీన్‌ను రవీంద్ర చౌదరి బుధవారం అభినందించారు. ఈ సందర్భంగా రవీంద్ర చౌదరి మాట్లాడుతూ.. ఈ నెల ఏడు నుంచి 19వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో జరిగే ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లో ఆల్ ఇండియా యూనివర్సిటీ క్రికెట్ జట్టులో ఖాజా మొహిద్దీన్ ఆడనున్నాడని తెలిపారు. ఆలిండియా ఇంటర్ వర్సిటీ క్రికెట్ సెలక్షన్ ట్రయల్స్‌లో ఖాజా మొహిద్దీన్ అర్హత సాధించి ఆల్ ఇండియా యూనివర్సిటీ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడని పేర్కొన్నారు.


