
పప్పీలకు ప్రేమతో..
జంతు ప్రేమికులు తమ పప్పీలతో బారులు తీరారు.. తాము పెంచుకునే పెట్‌లకు ప్రేమతో టీకాలు వేయించారు. ఆదివారం ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా లబ్బీపేటలోని డాక్టర్ ఎన్టీఆర్ వెటర్నరీ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌లో పెంపుడు జంతువులకు ఉచితంగా రేబిస్ వ్యాక్సిన్లు వేశారు. ఈ శిబిరాన్ని పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ డాక్టర్ టి. దామోదరనాయుడు, పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్‌తో కలిసి ప్రారంభించారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్,
విజయవాడ

పప్పీలకు ప్రేమతో..