
తల్లిదండ్రుల చెంతకు తప్పిపోయిన బాలలు
పటమట(విజయవాడతూర్పు): చదువుకోవటం ఇష్టంలేక హాస్టల్ నుంచి పారిపోయిన ఇద్దరు చిన్నారులను బుధవారం పటమట పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాల మేరకు హైదరాబాద్‌కు చెందిన 8వ తరగతి చదివే కందుకూరి సూర్యప్రకాష్(13), కర్నూలు జిల్లా నందికొట్కూరు, మారుతీనగర్‌కు చెందిన 9వ తరగతి చదివే కత్తిపోగు రాజ్ కుమార్(15) కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండ లం, ఏకమూరు గ్రామంలోని రెహబత్ వలంటరీ హాస్టల్లో ఉంటూ స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుకుంటున్నారు. వీరిద్దరూ బుధవారం ఉదయం 7.30గంటలకు హాస్టల్లో చెప్పకుండా బయటకు వచ్చారు. దీనిపై సదరు హాస్టల్ వార్డె న్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశా రు. బాలురు ఇరువురూ బుధవారం పట మట ఆటోనగర్‌లో సంచరిస్తున్నారని, పంటకాల్వ రోడ్డులో ఉన్నారని స్టేషన్‌కు సమాచారం రావటంతో అక్కడికి వెళ్లిన పటమట సీఐ పవన్‌కిషోర్ బాలురును విచారించగా విషయం తెలిసింది. దీంతో వెంటనే సంబంధిత హాస్టల్‌కు, తల్లిదండ్రులకు సమాచారం అందించి అప్పగించారు.
17 క్రషర్లు సీజ్
కంచికచర్ల: మండలంలోని పరిటాల, దొనబండ క్వారీలు, క్రషర్‌లను మైనింగ్, పర్యావరణ, ఇరిగేషన్‌శాఖ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు విరుద్ధంగా క్రషర్లు నడుపుతున్నారని గుర్తించి 17 క్రషర్లను తాత్కాలికంగా సీజ్ చేశారు. రెండు రోజుల నుంచి తమ పంట పొలాలు క్రషర్ల వల్ల దుమ్మూ, ధూళితో నిండి ఉంటున్నాయని, దీంతో పంటలు దెబ్బ తింటున్నాయని, క్రషర్ల యాజమాన్యంపై చర్య లు తీసుకోవాలని ఆందోళన చేస్తున్నారు. విష యం తెలుసుకున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ, మైనింగ్ ఏఈ, ఇరిగేషన్ ఏఈలు క్వారీలు, క్రషర్‌లను తనిఖీ చేశారు. ఇరిగేషన్ అధికారులు కాచేటి వాగుపై అక్రమంగా వేసిన రోడ్డును తొలగించాలని ఇరిగేషన్ ఏఈ రాజేష్ తెలిపారు.