
సజావుగా పాలిసెట్ ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): పాలిసెట్–2025లో ర్యాంకులు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పక్రియ సజావుగా కొనసాగుతోంది. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో కేంద్రంలో ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు 166 మంది, మాచవరంలోని ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో కేంద్రంలో 220 మంది, ఆంధ్రా లయోల డిగ్రీ కళాశాల ఆవరణలో 202 మంది జనరల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది. మొత్తం 588 మంది సర్టిఫికెట్లను గురువారం పరిశీలించి వారికి ధ్రువీకరణ పత్రాలను అందచేశామని పాలిసెట్–2025 ఎన్టీఆర్ జిల్లా కో–ఆర్టినేటర్ ఎం.విజయసారథి తెలిపారు.