మళ్లీ సెప్టెంబర్‌లో.. | - | Sakshi
Sakshi News home page

మళ్లీ సెప్టెంబర్‌లో..

Jul 4 2025 3:40 AM | Updated on Jul 4 2025 3:40 AM

మళ్లీ

మళ్లీ సెప్టెంబర్‌లో..

కొనసాగుతున్న ఏరివేత!

జిల్లావ్యాప్తంగా ఆహారభద్రత కార్డుల్లో బోగస్‌ పేర్ల (చనిపోయిన, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు, విదేశాలకు వెళ్లిన వారు) ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. సుమారు 9వేల మంది ఉన్నట్లు పౌరసరఫరాలశాఖ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు జాబితాను తహసీల్‌ కార్యాలయాలకు పంపించారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి బోగస్‌ పేర్లను తొలగించనున్నారు.

సుభాష్‌నగర్‌: వర్షాకాలం నేపథ్యంలో కేంద్ర ప్రభు త్వ సూచనల మేరకు మూడు నెలలకు సంబంధించి రేషన్‌ బియ్యం పంపిణీని జూన్‌లోనే పూర్తిచేశా రు. నెలరోజులపాటు అందుబాటులో ఉండి కా ర్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించారు. ఈ మేరకు డీలర్లు నెలరోజు ల్లో జూన్‌, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి 96.99శాతం కార్డుదారులకు సుమారు 25,190 మె ట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశారు. మళ్లీ సెప్ట్టె ంబర్‌లోనే రేషన్‌ బియ్యం పంపిణీ చేయనున్నారు.

మూడు నెలల రేషన్‌ బియ్యం ఒకేసారి పంపి ణీ చేస్తారని ఓ వైపు ప్రకటించడంతోపాటు ఒక్క నెలలోనే 1,293 కొత్త కార్డులు జారీ చేశారు. 18,399 మంది లబ్ధిదారులు కొత్తగా చేరారు. ప్రస్తుతం కొత్త కార్డులు, పేర్లను నమోదు చేసేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మీసేవ ద్వారా కొనసాగుతోంది. వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తు న్నాయి. పేర్లు చేర్పు కోసం 19వేలు, కొత్త కార్డుల కోసం 14,500 వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. నిత్యం వందల సంఖ్యలో జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి దరఖాస్తుదారులు తరలివస్తున్నారు.

రేషన్‌ దుకాణాలు 759

ఆహార భద్రత కార్డులు 4,03,510

లబ్ధిదారులు 13,32,864

మూడు నెలల రేషన్‌ కోటా

జూన్‌లోనే పంపిణీ

బియ్యం అందుకున్న

96.99శాతం కార్డుదారులు

తహసీల్‌ కార్యాలయాలకు

బోగస్‌ పేర్ల జాబితా

నూతన కార్డులు, పేర్ల నమోదుకు

అందుతున్న దరఖాస్తులు

సమస్య లేకుండా పంపిణీ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూ చనల మేరకు జిల్లాలోని 759 రేషన్‌షాపుల ద్వారా రేషన్‌ పంపిణీ చేపట్టాం. 96.99 శాతం మందికి సన్నబియ్యం పంపిణీ పూర్తయ్యింది. మళ్లీ సెప్టెంబర్‌లోనే రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేపడుతాం. కొత్త కార్డులు, పేర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

– అరవింద్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి

25,190 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ

కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు జిల్లాలో 25,190 మెట్రిక్‌ టన్నుల బియ్యం 759 రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి మూడు నెలల బియ్యం 18 కిలోల చొప్పున అందజేశారు. జూన్‌ నెల మొత్తం రేషన్‌డీలర్లు దుకాణాలు తెరిచి ఉంచి 96.99శాతం పంపిణీ పూర్తిచేశారు. 3,78,095 మంది కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయగా, 25,415 మంది కార్డుదారులు బియ్యం తీసుకోలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. బియ్యం పంపిణీ సమయంలో కార్డుదారులు మూడుసార్లు వేలిముద్రలు వేయాల్సి ఉండగా, జూన్‌ మొదటివారంలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. కేంద్రప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరించడంతో పంపిణీ ప్రక్రియ సాఫీగా పూర్తయ్యింది.

మళ్లీ సెప్టెంబర్‌లో.. 1
1/1

మళ్లీ సెప్టెంబర్‌లో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement