
నేటితో ముగియనున్న వారాహి నవరాత్రులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నగరంలోని అమ్మ వెంచర్‌లో నిర్మిస్తున్న శ్రీ వారాహి మా త ఆలయం వద్ద గత నెల 26వ తేదీ నుంచి నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాలు శుక్రవారంతో ముగియనున్నాయి. ఆలయ కమి టీ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ గుప్తా ఆధ్వ ర్యంలో ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అమ్మవారికి శోడశోపచార పూజలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఏటా ఆషాఢ శుద్ధ ప్రతిపద నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు నవరాత్రి పూజలు నిర్వహించడం సంప్రదాయం. ప్రతిరోజూ పూజా కార్యక్ర మాల అనంతరం అన్నప్రసాద వితరణ కా ర్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా పలుమార్లు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి
అథ్లెటిక్స్‌కు ఎంపిక
నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండల కేంద్రానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి ఎస్‌కే అనాస్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపికయ్యాడు. జిల్లా కేంద్రంలోని నాగారంలో జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో నందిపేట సిద్ధార్థ పాఠశాలకు చెందిన ఎస్‌కే అనాస్ అండర్–14 విభాగంలోని బ్యాక్ త్రోలో బంగారు, లాంగ్‌జంప్‌లో వెండి, 60 మీటర్ల పరుగు పోటీలో వెండి పతకం సాధించాడు. దీంతో అనాస్‌ను జిల్లా అథ్లెటిక్ సంఘం రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. పాఠశాల కరస్పాండెంట్ దేవన్న, డైరెక్టర్ వంశీ, పీఈటీ రంజిత్, ఉపాధ్యాయులు అనాస్‌ను అభినందించారు.
జావెలిన్ త్రో పోటీలకు..
మోపాల్(నిజామాబాద్‌రూరల్): మండలంలోని కంజర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న కుందెన్ సిద్ధాంత్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం గోపాలచారి తెలిపారు. నగరంలోని నాగారం రాజారాం స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పాఠశాల నుంచి 16 మంది విద్యార్థులు పాల్గొనగా, అండర్–12 జావెలిన్ త్రో బాలుర విభాగంలో సిద్ధాంత్ ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఈ నెల 6న హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థి పాల్గొంటాడన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న సిద్ధాంత్‌ను హెచ్‌ఎం, ఉపాధ్యాయులు గోపాలకృష్ణ, అరుణ శ్రీ, ఎంఎస్ రాణి, కాంతి కిరణ్, ఉమా గౌరి, భూమయ్య, విజయలక్ష్మి అభినందించారు.
నలుగురికి ఏడీఏలుగా పదోన్నతి
డొంకేశ్వర్(ఆర్మూర్): జిల్లా వ్యవసాయ శాఖ లో పనిచేస్తున్న నలుగురు ఏవోలకు ఏడీఏలుగా పదోన్నతి లభించింది. పదోన్నతితో పాటు పోస్టింగులు ఇస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కార్యా లయంలో టెక్నికల్ విభాగంలో ఉన్న గోపికి మంచిర్యాల, శ్రీనివాస్‌కు ఆదిలాబాద్, రెంజల్ ఏవో శ్రీనివాస్ రావుకు కుమురం భీం, డిచ్‌పల్లి ఏవో సుధా మాధురికి ఎల్లారెడ్డి ఏడీఏగా పదోన్నతి పోస్టింగ్‌లు లభించాయి. పదోన్నతులు పొందిన అధికారులకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరాస్వామితోపా టు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
ఎస్సారెస్పీలోకి 8,718 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
బాల్కొండ: శ్రీరాంసాగర్ జలాశయంలోకి ఎగువ ప్రాంతాల నుంచి 8,718 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 100, ఆవిరి రూపంలో 304, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా గురువారం సాయంత్రానికి 1065.90 (17.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు.

నేటితో ముగియనున్న వారాహి నవరాత్రులు