
రోత పుట్టిస్తున్న రోడ్లు
● నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో అధ్వానంగా పరిస్థితులు
● భారీ గుంతలు.. కనిపించని కల్వర్టులు
● నగర ప్రజలకు తప్పని ఇబ్బందులు
నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నివాస గృహాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. నలుదిశలా కాలనీలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే తొమ్మిది గ్రామాలను కార్పొరేషన్ లో విలీనం చేశారు. అయితే ఆయా ప్రాంతాలను కలిపే రోడ్లు మాత్రం రోతపుట్టిస్తున్నాయి. కార్పొరేషన్ పరిధిలో రోడ్ల పరిస్థితి మెరుగుపడడం లేదు. కార్పొరేషన్ పరిధిలో మొత్తం రోడ్లు 914 కిలో మీటర్ల మేర ఉండగా.. ఇందులో ఆర్‌అండ్‌బీ రోడ్లు 55 కిలో మీటర్లు, సీసీ రోడ్లు 415 కిలోమీటర్లు, బీటీ రోడ్లు 148 కిలోమీటర్లు, గ్రావిటీ రోడ్లు 296 కిలో మీటర్ల మేర ఉన్నాయి.
రోడ్లు లేక ఇబ్బందులు..
60 డివిజన్ పరిధిలో 4లక్షల 30వేల జనాభా ఉండ గా రోడ్లు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. డ్రెయినే జీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రోడ్లపై మురికి నీ రు నిలుస్తోంది. శివారు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ముబారక్ నగర్, మారుతినగర్, లక్ష్మీప్రియనగర్ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగుతుండగా రోడ్ల వసతి మాత్రం లేదు. ధర్మపురి హిల్స్, నిజాంకాలనీ, వెంగళరావునగర్ కాలనీ, నా గారం, ఆటోనగర్, మాలపల్లి ప్రాంతాల్లో సైతం నేటికీ రోడ్ల వసతి సక్రమంగా లేదు. సీసీ రోడ్లు ఉన్న చాలా ప్రాంతాల్లో లింక్‌రోడ్లు మట్టివి ఉన్నాయి. వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లు సరిగా లేక రాత్రి వేళలో వీధి దీపాలు వెలగకపోవడంతో వాహ నదారులు ప్రమాదాలబారినపడుతున్నారు. మాలపల్లి, ధర్మపురి హిల్స్, అర్సపల్లి, చంద్రశేఖర్‌కాలనీ, గౌతమ్‌నగర్, దుబ్బ ప్రాంతాల్లో పరిస్థితి అధ్వానంగా మారుతోంది. చంద్రశేఖర్ కాలనీ, వివేకానంద నగర్ కాలనీల్లో ఇప్పటికీ మట్టి రోడ్లే ఉన్నాయి.

రోత పుట్టిస్తున్న రోడ్లు