
సుభాష్‌నగర్ : వినాయక చవితి పర్వదినా న్ని పురస్కరించుకుని మంత్రి వేముల ప్ర శాంత్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు ఆదివారం వినాయక చవి తి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొల గించే ఆది దేవుడైన వినాయకుని వేడుకలను ఎప్పటిలాగే సహృద్భావ వాతావరణంలో ఆ నందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు.
బాసర డీఐజీగా
సత్యనారాయణ
ఖలీల్‌వాడి : రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ ఆ దేశాల మేరకు ఆదివారం జోన్–2 బాసర పోలీస్ కార్యాలయంలో డీఐజీగా సీపీ సత్యనారాయణ అదనపు బాధ్యతలు స్వీకరించా రు. సీపీ సత్యనారాయణకు జనవరి, 2024 లో ఐజీగా ప్రమోషన్ రానున్నట్లు సమాచారం.కార్యక్రమంలో అదనపు డీసీపీ (లా అండ్ ఆర్డర్ జయరాం, అదనపు డీసీపీ (ఏఆర్) గిరిరాజు, ఏసీపీ కిరణ్ కుమార్, ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు, జోన్ – 2 బాసర పోలీస్ కా ర్యాలయం మేనేజర్ రాజప్రసాద్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు.
ఖిల్లా కోటపై ఎగిరిన జాతీయ జెండా
నిజామాబాద్ సిటీ : ఇతిహాస సంకలన సమి తి ఆధ్వర్యంలో ఇందూరు చరిత్రకు మణిమకుటమైన ఖిల్లా కోటపై జాతీయ జెండా రెపరెపలాడింది. ఆదివారం తెలంగాణ విమోచ న దినోత్సవ సందర్భంగా ఇతిహాస సంకల న సమితి ఆధ్వర్యంలో ఇతిహాస సంకలన స మితి సీనియర్ సభ్యుడు భోగరాజు వేణుగో పాల్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ ఖిల్లా కోట ఆకతాయిల అడ్డాగా మారిందని, శిథి లావస్థకు చేరిందని ఆవేదన చెందారు. ఖిల్లా కోటకు మరమ్మతులు చేపట్టాలన్నా రు. దీనికిగాను ఇతిహాస సంకలన సమితి త్వరలోనే అందరినీ కలిసి కార్యాచరణ రూపొందించనుందన్నారు. ఇతిహాస సంక లన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కందకుర్తి ఆనంద్, ప్రవీణ్‌లు పాల్గొన్నారు.
జాతీయ సమైక్యత
దినోత్సవానికి గైర్హాజరు
సుభాష్‌నగర్ : నగరంలోని కలెక్టరేట్‌లో ఆదివారం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ కార్యక్రమానికి వివిధ శాఖల సిబ్బంది, జిల్లాస్థాయి అధికారులు గైర్హాజరయ్యా రు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి జాతీయ జెండా ఆ విష్కరించి, ప్రసంగించారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టినప్పటికీ కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది పరిమిత సంఖ్యలో వచ్చా రు. కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. అధికారులు, సిబ్బంది గైర్హాజరుపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులే మేలు
సుభాష్‌నగర్ : పర్యావరణ పరిరక్షణకు మ ట్టి గణపతులు మేలు చేస్తాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న హె
ల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ తరపున ఆదివారం కలెక్టరేట్‌లో మంత్రి ప్రశాంత్ రెడ్డితోపాటు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎ మ్మెల్యే బిగాలకు మట్టి గణపతులు అందజేశారు. రెవెన్యూ ఉద్యోగు ల సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, కార్యదర్శి ప్రశాంత్, టీఎన్‌జీవో అధ్యక్షుడు అలుక కిషన్, తహశీల్దార్ వేణుగోపాల్ ఉన్నారు.
