న‌న్ను కిడ్నాప్ చేశారు : ధృవ్ రాఠీ | I Was Kidnapped, Not Detained : YouTuber Dhruv Rathee | Sakshi
Sakshi News home page

న‌న్ను కిడ్నాప్ చేశారు : ధృవ్ రాఠీ

Oct 11 2026 12:28 PM | Updated on Oct 11 2026 12:40 PM

I Was Kidnapped, Not Detained : YouTuber Dhruv Rathee

ఢిల్లీ: కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనల వేళ దేశ రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నిరసనలకు మద్దతుగా నిలిచిన ప్రముఖ యూట్యూబర్, యాక్టివిస్ట్ ధృవ్ రాఠీని ఢిల్లీ పోలీసులు మఫ్టీలో వచ్చి అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది.

శనివారం ఉదయం గురుగ్రామ్‌లోని సెక్టార్ 56లో ఉన్న ధృవ్ రాఠీ ఇంటికి సుమారు 50 మంది మ‌ఫ్టీలో ఉన్న పోలీసులు వచ్చారు. జంతర్ మంతర్ వద్ద జరగాల్సిన నిరసనల్లో పాల్గొనకుండా ఆయన్ను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. రాత్రి విడుదలైన తర్వాత ధృవ్ రాఠీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు.  నన్ను పోలీసులు అరెస్ట్ చేయలేదు. నిర్బంధించలేదు.. కిడ్నాప్ చేశారు! అంటూ ఓ వీడియోను విడుదల చేశారు. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే ఆయన్ని మళ్లీ అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

భారీగా అరెస్టులు.. నిలిచిపోయిన మెట్రో!
జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను కోరుతూ సీజేపీ పిలుపునిచ్చిన ఈ ఆందోళనలను అణచివేసేందుకు ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జంతర్ మంతర్‌ను ముట్టడించకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సుమారు 3,000 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని, రాత్రికి విడుదల చేశారు. సీజేపీకి చెందిన అభిజీత్ డిప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత మేజిస్ట్రేట్ ఎదుట విడుదల చేశారు.

ఈ నిరసనల నేపథ్యంలో శనివారం ఢిల్లీ మెట్రో స్టేషన్లు, రైలు సర్వీసులను పూర్తిగా నిలిపివేయడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. మెట్రో సేవలను పూర్తిగా నిలిపివేయరాదని ప్రధాన జ్యుడీషియల్ బెంచ్ స్పష్టం చేయడంతో, ఆదివారం ఉదయం మెట్రో సర్వీసులు సాధారణంగానే నడుస్తున్నాయి. అయినప్పటికీ, ఎంట్రీ ,ఎగ్జిట్ గేట్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement