ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? | Anand Mahindra Ask Netigens To Guess Answer To This Question | Sakshi
Sakshi News home page

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా?

Sep 18 2020 5:06 PM | Updated on Sep 18 2020 6:14 PM

Anand Mahindra Ask Netigens To Guess Answer To This Question - Sakshi

ఢిల్లీ : ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో ఎంతో చురుకుగా ఉంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆనంద్‌ మహీంద్రా  రగ్బీ గేమ్‌కు సంబంధించి నాలుగు ఫోటోలు షేర్‌ చేస్తూ మార్నింగ్‌ క్విజ్‌ అంటూ ఒక పజిల్‌ విసిరారు. అయితే ఫోటోలు చూస్తే.. ఒక రగ్బీ ప్లేయర్‌ బాల్‌ తన చేతిలోకి తీసుకొని అడ్డు వచ్చిన వారిని తోసుకుంటూ మరీ ముందుకు వెళుతున్నాడు. ఈ అంశంలో అతను ఏదో సాధించాలనే ప్రయత్నంతో పరిగెడుతున్నాడు.

దీనికి సంబంధించి ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేస్తూ.. 'గుడ్‌మార్నింగ్‌ క్విజ్‌..నేను ఇలాంటి ఫోటోలు ఎందుకు పెడతానో ఎప్పుడైనా ఆలోచించారా..(ఇండియాలో అమెరికన్‌ ఫుటబాల్‌ లీగ్‌ ప్రారంభించాలనుకుంటున్నా..అనేది తప్పుడు జవాబు.).. అసలు విషయం ఏంటంటే ఫోటో అర్థం కావాలంటే దాని అంతరంగం ఏంటనేది ఆలోచించండి... అప్పుడు విషయం అర్థమవుతుంది. ' అంటూ షేర్‌ చేశారు.  ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement