సన్నబియ్యం పక్కదారి
నర్వ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తీసుకొని రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు సరఫరా అవుతున్న సన్నం బియ్యం పక్కదారి పడుతోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సన్యం బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న దళారులు సరిహద్దులోని కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు రేషన్ డీలర్లు లబ్ధిదారులకు కిలోకు రూ.15 చొప్పున చెల్లిస్తూ.. కొంత లాభం తీసుకొని దళారులకు విక్రయిస్తున్నారు. వాటినే ప్రాసెస్ చేసి అక్రమార్కులు బహిరంగ మార్కెట్‌లో రూ.40 నుంచి రూ.50 వరకు అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ వాటిపై నిఘా ఉంచాల్సిన సివిల్‌సప్లై అధికారులు చోద్యం చూస్తున్నారు.
పక్క రాష్ట్రాలకు తరలింపు..
జిల్లాలో కొన్ని రోజులుగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేయడంతో పాటు స్థానిక పోలీసులు చేపట్టిన పెట్రోలింగ్‌లో రేషన్‌బియ్యం పట్టుబడుతూనే ఉంది. అయినా కొందరు దళారులు పోలీసుల కళ్లు కప్పి జిల్లాలోని ఆయా మండలాల నుంచి, నారాయణపేట మీదుగా, మక్తల్ మీదుగా కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూర్, గుర్మిట్కల్, బెంగళూర్, మహారాష్ట్రలోని ముంబాయి, తమిళనాడు రాష్ట్రం చైన్నెకి ఈ బియ్యం విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇలా మార్కెటింగ్ చేపట్టిన మిల్లర్లు రూ.కోట్లల్లో ఆర్జిస్తున్నారు. దీనికి తోడు రైస్‌మిల్లర్లు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, వాటినే పాలిష్ చేసి లేవీ కింద ప్రభుత్వానికి, ఇటు వ్యాపారస్థులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మిల్లర్లు రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేయకుండా కేవలం ప్రభుత్వం అందించే వడ్లను బియ్యంగా మార్చి, వీటిని బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తూ.. ప్రభుత్వానికి ప్రాసెస్ చేసిన రేషన్ బియ్యాన్నే తిరిగి సీఎమ్మార్‌గా అందిస్తున్నారు.
కొన్ని ఘటనలు
ధన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల బొలెరో వాహనంలో తరలిస్తున్న 15.60 క్వింటాళ్ల రేషన్‌బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
నర్వ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లోని లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసిన సన్నబియ్యాన్ని కర్ణాటకకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని పంచనామ నిర్వహించి నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ బియ్యాన్ని మిల్లుల్లో మరోసారి మర ఆడించి 25 నుంచి 50 కిలోల సంచుల్లో నింపి బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు, పౌర సరఫరాల శాఖ అధికారులు గుర్తించారు.
దామరగిద్ద మండలంలోని మొగుల్‌మడ్కలో అక్రమంగా నిల్వ ఉంచిన 7 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకొని, కేసు నమోదు చేశారు.
ధన్వాడ మండంలోని కొండాపూర్‌లో 5.2 క్వింటాళ్లు, మరికల్ పట్టణ కేంద్రంలో 5.50 క్వింటాళ్లు, నర్వ మండలంలో 10 క్వింటాళ్ల సన్నబియ్యాన్ని పోలీసులు అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు.
జిల్లాలో జోరుగా రేషన్ బియ్యం దందా
సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు
కిలో రూ.15 కి కొనుగోలు చేస్తున్న దళారులు
37 కేసులు, 586 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
చర్యలు తీసుకోవలంటున్న ప్రజలు
దాడులు ముమ్మరం
జిల్లా సరిహద్దుల మీదుగా కర్ణాటకకు అక్రమ రేషన్‌బియ్యం తరలిస్తున్నట్లు దాడు ల్లో పట్టుబడిన వ్యక్తులను విచారించగా తెలిసింది. దీంతో జిల్లాలోని సరిహద్దు ప్రాంతా ల్లో ఎప్పటికప్పడు పోలీస్‌శాఖ సహకారంతో దాడులు ముమ్మరం చేశాం. లబ్ధిదారులు రే షన్ బియ్యాన్ని అమ్ముకున్నట్లు తేలితే రేషన్ కార్డులు రద్దు చేస్తాం. అక్రమ దళారులపై కే సులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటాం.
– వంగాల బాల్‌రాజు డీఎస్‌ఓ, నారాయణపేట
సన్నబియ్యం పక్కదారి


