సర్పంచ్‌లకు 391.. వార్డులకు 1,224
కోస్గి/మద్దూరు: జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత నామినేషన్ల స్వీకరణ గడువు శనివారంతో ముగిసింది. కోస్గి, మద్దూర్, గుండుమాల్, కొత్తపల్లి మండలాల పరిధిలోని 67 పంచాయతీలకు 391 నామినేషన్లు, 572 వార్డులకు సంబంధించి 1,224 నామినేషన్లు దాఖలయ్యాయి. కోస్గి మండలంలో 14 సర్పంచ్ స్థానాలకు మొత్తం 97 నామినేషన్లు, 122 వార్డులకుగాను 324 నామినేషన్లు దాఖలయ్యాయి. మద్దూర్ మండలంలో 24 సర్పంచ్ స్థానాలకు 127 నామినేషన్లు, 206 వార్డులకు 411 నామినేషన్లు దాఖలయ్యాయి. కొత్తపల్లి మండలంలో 16 సర్పంచ్ స్థానాలకు 78 నామినేషన్లు, 130 వార్డులకు 276 నామినేషన్లు దాఖలయ్యాయి. గుండుమాల్ మండలంలో 13 సర్పంచ్ స్థానాలకు 89 నామినేషన్లు, 114 వార్డులకు 213 నామినేషన్ దాఖలైనట్లు ఆయా మండలాల అధికారులు తెలిపారు. మొదటి రోజు మొత్తం సర్పంచ్ స్థానాలకు 69 నామినేషన్లు, వార్డులకు 38 నామినేషన్లు దాఖలయ్యాయి.
సర్పంచ్‌లకు 391.. వార్డులకు 1,224


