
ఫోన్ చేయాల్సిన నంబర్: 96180 99288
తేది: 04–07–2025, సమయం: మధ్యాహ్నం 12 నుంచి 1గంట వరకు
నారాయణపేట: జిల్లా కేంద్రమైన నారాయణపేట మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పుర కమిషనర్ భోగేశ్వర్ దృష్టికి తీసుకొచ్చేందుకు గాను శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహించనుంది. తాగునీటి ఇబ్బందులు, డ్రెయినేజీల్లో మురుగు తొలగించకపోవడం, దోమలబెడద, పందులు, కుక్కల స్వైరవిహారం, వీధిలైట్లు వెలుగకపోవడం, ఓపెన్ ప్లాట్లలో ముళ్లపొదలు, ఇళ్ల మధ్య మురుగునీరు తదితర సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవచ్చు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
నేడు మున్సిపల్ కమిషనర్‌తో ‘సాక్షి’ ఫోన్ ఇన్

ఫోన్ చేయాల్సిన నంబర్: 96180 99288