
రీవెరిఫికేషన్
గతేడాది ఫిబ్రవరి 20న అప్పటి కలెక్టర్, జిల్లా సెలక్షన్ కమిటీ చైర్మన్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సు, ఎంఎల్‌హెచ్‌పీ, వీసీసీఎం పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో నిలుపుదల చేశారు. ఆతర్వాత కలెక్టర్ల బదిలీలో కోయ శ్రీహర్ష బదిలీ కావడంతో జూన్ 16న ప్రస్తుత కలెక్టర్ సిక్తా పట్నాయక్ బాధ్యతలు చేపట్టారు. మరో సారి జూలై 2న నోటిఫికేషన్ విడుదల చేసి జూలై 3 నుంచి 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈమేరకు 25 స్టాఫ్ నర్సు పోస్టులకు 503 మంది దరఖాస్తు చేయగా.. 5 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు 140 మంది, ఒక్క వీసీసీఎం పోస్టుకు 84 మంది దరఖాస్తు చేసుకున్నారు. 15వ తేదీ నుంచి 25 వరకు దరఖాస్తులను పరిశీలించారు. అయితే, 26న ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ ఆన్‌లైన్‌లో ఉంచాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. తిరిగి సెప్టెంబర్ 20న లిస్టు ఉంచారు. 29వ తేదీ వరకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ మాత్రం విడుదల కాకపోవడం.. అప్పట్లో పలు అనుమానాలకు తావిచ్చింది. గత డీఎంహెచ్‌ఓపై పలు ఆరోపణలు రావడంతో ఆమెను డైరక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు సరెండర్ చేశారు. ఆ తర్వాత బదిలీపై వచ్చిన ప్రస్తుత డీఎంహెచ్‌ఓ జయచంద్రమోహన్ సమక్షంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగింది.