
ఆస్పత్రి నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలి
మక్తల్: పట్టణంలో చేపట్టిన 150 పడకల ఆస్పత్రి నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని, ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా యుద్ధ ప్రాతిపదికగా చేపట్టాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం పట్టణంలో ఆస్పత్రి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేస్తుందని, ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్మమని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మంత్రి అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన ఆస్పత్రి పనులను మొదటిసారిగా పరిశీలించారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మారెడ్డి, హన్మంతు, చంద్రకాంత్‌గౌడ్, కోళ్ల వెంకటేష్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.