
గదుల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని సుభాష్ రోడ్, పత్తి బజార్‌లో గల పాత పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ స్థలంలో నిర్మిస్తున్న పోలీస్ జాగిలాల నూతన గదులను మంగళవారం ఎస్పీ యోగేష్ గౌతమ్ పరిశీలించారు. నాలుగు పోలీస్ జాగిలాలకు నూతన గదులను నిర్మిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. జాగిలాల ఆరోగ్యం, భద్రత, శుభ్రతను దృష్టిలో ఉంచుకొని గదుల నిర్మాణం ఉండాలని, వీటిని త్వరగా పూర్తిచేయాలని, తగిన వెళుతురు ఉండేలా చూడాలని, డాగ్స్ వాషింగ్‌కి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్, సీఐ నరసింహ, హెడ్ కానిస్టేబుల్ రాములు ఉన్నారు.