
ఓటరు జాబితాపై బీఎల్‌ఓలకు శిక్షణ
నల్లగొండ: కొత్త ఓటర్ల జాబితా రూపొందించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. అందులో భాగంగా బీఎల్‌ఓలకు ఓటర్ల జాబితా తయారీ విధానంపై శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించింది. ఈమేరకు జిల్లాలో గురువారం నుంచి ప్రారంభమైన శిక్షణ ఈనెల 17వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఓటర్ల జాబితాకు సంబంధించి బీఎల్‌వోలు ఇంటింటికీ తిరిగి 18 సంవత్సరాలు నిండి ఉండి ఓటు నమోను చేసుకొని వారిని గుర్తించి ఓటరు నమోదు చేసుకునేవిధంగా వివరించడం, చనిపోయిన వారి పేర్లు కుటుంబసభ్యులకు తెలియజేసి జాబితా నుంచి తొలగించడం వంటివి చేయనున్నారు.
త్వరలో స్పెషల్ సమ్మరీ రివిజన్ షెడ్యూల్
2026 జనవరి 1 తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తయ్యే వారికి ఓటు హక్కు కల్పించేందుకు స్పెషల్ సమ్మరీ రివిజన్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో షెడ్యూల్ వెలువరించే అవకాశం ఉంది. దీంతో కొత్త ఓటర్ల జాబితాను రూపొందించేందుకు ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా బీఎల్‌ఓలకు శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించింది.
ఫ మండల, నియోజకవర్గ స్థాయిలో ప్రారంభమైన శిక్షణ
ఫ ఈ నెల 17 వరకు కొనసాగనున్న కార్యక్రమాలు