
చిట్టీల వ్యాపారి అరెస్ట్
చిట్టీలు కట్టించుకుని మోసం చేసి పారిపోయిన చిట్టీల వ్యాపారిని మిర్యాలగూడ టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
- 8లో
హాలియాలో చెత్త కంపు
హాలియా : హాలియా మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా చెత్త సేకరణ కోసం 51 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. చెత్త సేకరణకు ఆరు ఆటోలు, మూడు ట్రాక్టర్లు ఉన్నాయి. అయినా పారిశుద్ధ్యం అధ్వానంగా మారుతోంది. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం చెత్తచెదారంతో పేరుకుపోయింది. రోజూ చెత్తను సేకరిస్తున్నామని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారే తప్ప.. నివాసాల వద్దకు వచ్చి సేకరించడం లేదు. దీంతో ఇళ్లలో పేరుకుపోయిన చెత్తను జనం బహిరంగ ప్రదేశాల్లో వేస్తున్నారు. ఈ చెత్తను తీయకపోవడంతో ఆ ప్రాంతాలు పందులు, కుక్కలకు ఆవాసాలుగా మారుతున్నాయి. ఇక వానాకాలంలో చిన్నపాటి వర్షానికే పట్టణంలోని డ్రెయినేజీలు పొంగిపొర్లుతున్నాయి. ఖాళీ స్థలాల్లో మురుగు నిలిచి, పిచ్చి మొక్కలు దట్టంగా పెరిగి దోమలు విజృంబిస్తున్నాయి. ఇక ఇళ్ల నిర్మాణాలు జరిగే ప్రాంతాల్లో కొత్త డ్రెయినేజీల నిర్మాణం ఊసే లేకపోవడంతో మురుగు రోడ్లపై పారుతోంది. దీంతో దుర్ఘందంలో జనం అల్లాడుతున్నారు. మురుగు నీరు నిల్వ ఉన్న చోట కనీసం బ్లీచింగ్ ఫౌడర్, కెమికల్ స్ప్రే కూడా చేయడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రెయినేజీలను రోజూ శుభ్రం చేయడంతో పాటు వార్డుల్లో పెరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.