
వీధుల్లో పారుతున్న మురుగు
పెద్దవూర : మండలంలోని జయరాంతండాలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. తండాలోని చాలా వీధుల్లో సీసీ రోడ్లు ఏర్పాటు చేసినప్పటికీ మురుగు కాల్వలను నిర్మించలేదు. దీంతో ఇళ్ల నుంచి వ్యర్థాలతో కూడిన నీరు వీధుల వెంట పారుతూ చిన్నపాటి కుంటలను తలపిస్తున్నాయి. చిన్నపాటి వర్షం వచ్చినా సీసీ రోడ్లపై మోకాళ్లలోతులో నీరు నిల్వ ఉంటుంది. మురుగు కాల్వలను నిర్మించకపోవడంతో సీసీ రోడ్లపై నీరు నిలిచి మురికికూపంగా తయారై వీధులన్ని కంపుకొడుతున్నాయి. ఇవి దోమలకు నిలయాలుగా మారి విషజ్వరాలకు కారణభూతం అవుతున్నాయి. వర్షాలు లేని సమయంలోనే ఇలా ఉంటే వర్షాలు కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించటానికి కష్టంగా ఉంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి సీసీ రోడ్ల వెంట మురికి కాల్వలను నిర్మించి వీధులలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని తండావాసులు కోరుతున్నారు.
పాఠశాలలోకి వెళ్లేదెలా..
నిడమనూరు : మండలంలోని ఆదర్శ పాఠశాల ప్రధాన గేటు ఎదుట మురుగునీరు ప్రవనిలిచిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుంది. దీంతో విద్యార్థులు పాఠశాలలోకి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు కొన్ని మీటర్ల దూరంలో ఆదర్శ పాఠశాల హాస్టల్ ఉంది. దీంతో విద్యార్థులు వాసన భరించలేకపోతున్నారు. వర్షం వస్తే మురుగు ప్రవాహం పెరిగిపోయి పాఠశాలలోకి ప్రవాహించే అవకాశం ఉంది. హాస్టల్ మెస్ కూడా పరిసరాల్లోనే ఉంది.పలు కాలనీల్లో నుంచి వచ్చే డ్రెయినేజీ మరుగు, వర్షపు నీరంతా ఆ పాఠశాల ముందునుంచే సమీపంలోని వాగులో కలుస్తాయి. కాల్వకు సీసీ లైనింగ్ లేకపోవడంతో మురుగు అంతా నిలిచిపోయి తీవ్ర దుర్గంధంగా మారింది. ఇప్పటికై న అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.

వీధుల్లో పారుతున్న మురుగు