
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
హాలియా : మండలంలోని నాయుడుపాలెంలో ఆదివారం సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి లబ్దిదారుడు ఓగిరాల శ్రీధర్‌కు సీఎంఆర్‌ఎఫ్ చెక్కును పంపిణీ చేశారు. నాయుడుపాలెం గ్రామానికి చెందిన ఓగిరాల శ్రీధర్ తల్లి ఓగిరాల లీలావతికి మంజూరైన రూ. 90వేల విలువగల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును ఆమె కుమారుడు ఓగిరాల శ్రీధర్‌కు ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ రామారావు, డాక్టర్ శ్రీధర్, మాజీ ఎంపీటీసీ అంజమ్మ, సర్ధార్, యడవెల్లి రాంబాబు, తేరా హనుమంతు, మున్సుబ్ తదితరులు ఉన్నారు.
విద్యాశాఖ
కమిషనర్‌కు వినతి
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడలోని ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజుల దోపిడీని నియంత్రించాలని కోరుతూ ఆదివారం హైదరాబాద్‌లో పాఠశాలల విద్యాశాఖ కమిషనన్ నవీన్ నికోలస్‌ను కలిసి బీసీ యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. పట్టణంలోని పలు పాఠశాలలు విద్యా హక్కు చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జీడయ్య యాదవ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమల గిరి అశోక్, ఉపేందర్, శ్రీనివాస్, రాజు, సైదయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక
చింతపల్లి : మండలంలోని నరసర్లపల్లి గ్రామ ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. ఆ సంఘం మండల అధ్యక్షుడు నల్ల కాశయ్య మాదిగ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆ సంఘం గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నల్ల సురేందర్ మాదిగ, ఉపాధ్యక్షుడు నల్ల మధు మాదిగ, పల్లె మొగులాన్ మాదిగ, ప్రధాన కార్యదర్శులు నల్ల సైదులు మాదిగ, నల్ల విష్ణు మాదిగ, కార్యదర్శి ఎలిమినేటి సైదులు మాదిగ, నల్ల వెంకటయ్య మాదిగ కార్యవర్గసభ్యుడు నక్క శివ మాదిగ, కోశాధికారి నల్ల రమేష్, మాదిగ, గౌరవ అధ్యక్షుడు పల్లె కృష్ణ మాదిగ, సహాయ కార్యదర్శి నల్ల గణేష్ మాదిగ, సంస్కృత కార్యదర్శి నక్క నరేందర్ మాదిగ, సోషల్ మీడియా గ్రామ శాఖ అధ్యక్షుడు నల్ల, గిరి మాదిగలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ప్రపంచంలోనే భారత రాజ్యాంగం గొప్పది
నల్లగొండ టౌన్: ప్రపంచంలోనే భారత రాజ్యాంగం గొప్పదని ప్రజాస్వామ్య పరిరక్షణ సేవా సమితి కన్వీనర్, న్యాయవాది పాశం నరేష్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ సేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండలోని అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లారు. రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు బానిసలుగా బతకాల్సిన రోజులు వస్తాయన్నారు. సనాతన ధర్మం అంటూ మనిషిని మనిషిగా చూడని మనుధర్మాన్ని అమల్లోకి తెచ్చే కుట్ర జరుగుతోందన్నారు. మేధావులు, ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ సమావేశంలో తిప్పర్తి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గాదె లింగస్వామి, వంటెపాక యాదగిరి, కత్తుల జగన్‌కుమార్, కె.పర్వతాలు, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్‌రెడ్డి, ఎండీ కుతుబుద్దిన్, పందుల సైదులు, కొండ లలితక్క, ఎండి రఫీ, వెంకులు, షరీఫుద్దీన్ పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత