మాస్‌ కాపీయింగ్‌కు తావివ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

మాస్‌ కాపీయింగ్‌కు తావివ్వొద్దు

Published Sat, Mar 1 2025 7:59 AM | Last Updated on Sat, Mar 1 2025 7:54 AM

కందనూలు: ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఎలాంటి మాస్‌ కాపీయింగ్‌కు తావివ్వకుండా చర్యలు తీసుకోవాలని ఇంటర్‌ పరీక్షల కన్వీనర్‌ వెంకటరమణ పవర్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ నెల 5 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్‌ పరీక్షలకు సంబంధించి శుక్రవారం జిల్లాకేంద్రంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లాలోని చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్‌ అధికారులు, అదనపు చీఫ్‌ సూపరింటెండెంట్లు, కస్టోడియన్లు, ప్రైవేట్‌ కళాశాల ప్రిన్సిపాళ్లకు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా శిక్షణ ఇచ్చారు. సమావేశంలో ఇంటర్‌ బోర్డు ప్రతినిధిగా డిప్యూటీ సెక్రటరీ విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్నిరకాల వసతులు కల్పించాలని, ఎలాంటి పొరపాట్లు చేయకుండా చూడాలని, సెల్‌ఫోన్‌ అనుమతించకూడదని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement