గురుకుల సీట్లే లక్ష్యంగా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు అక్కడే చదివినట్లు బోనఫైడ్, తదితర సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారు. గురుకులాల్లో సీటు వస్తే పిల్లలు ఐదు నుంచి ఏడేళ్లు అక్కడే హాస్టల్ ఉంటూ చదువుకుంటారని.. తగిన ఆర్థికస్థోమత లేకపోవడంతో ఇదే మేలని భావించిన తల్లిదండ్రులు అందుకు ఒప్పుకుంటున్నారు. కానీ అక్కడే వరుసగా చదివినట్లు సర్టిఫికెట్లు సృష్టిస్తున్న క్రమంలో ఆయా విద్యార్థులకు అక్కడి స్థానికతే వర్తిస్తుంది. దీన్ని గ్రహించకపోతే ఆ విద్యార్థులు భవిష్యత్‌లో నష్టపోయే అవకాశం ఉంది. ఈ మేరకు విద్యాశాఖాధికారులు అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేట్ కోచింగ్ సెంటర్లపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.