పెరిగారు. వారి కుటుంబాల్లో పెద్దగా ఎవరూ వ్యవసాయం చేసే వారు లేరు. కాలు, చేతికి మట్టి అంటకుండా ఉద్యోగం చేసే అవకాశమున్నా.. భూమినే నమ్ముకున్న రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. ప్రస్తుతం రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో
చదువుకుంటున్న నాలుగో సంవత్సరం విద్యార్థులు
క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఈ మేరకు రూరల్
అవెర్‌నెస్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ప్రోగ్రాం (రావేప్)పేరిట శిక్షణ పొందుతూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మొత్తం 51మంది విద్యార్థులు పది గ్రామాల్లో పర్యటిస్తున్నారు. అందులో కార్వంగలో నలుగురు, బొందలపల్లిలో ఆరుగురు, దాసుపల్లిలో ఐదుగురు, మాదారంలో నలుగురు, గొరిటాలో ఆరుగురు, కుమ్మెరలో ఐదుగురు,
మంగనూర్‌లో ఐదుగురు, తుమ్మల్‌సుగూర్‌లో ఐదుగురు, చేగుంటలో ఐదుగురు, అవంచలో ఆరుగురు విద్యార్థులు క్షేత్రపరిశీలనలో ఉన్నారు. ఈ సందర్భంగా వారి
అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.
– చెంచెటి హరిప్రసాద్, మహబూబ్‌నగర్ డెస్క్