హేమాచలుడి ఆదాయం రూ.7.39 లక్షలు
మంగపేట: మండల పరిధిలోని శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన 9 హుండీలలోని కానుకల లెక్కింపు ద్వారా రూ.7.39 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రేవెల్లి మహేశ్ తెలిపారు. జులై 29 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు స్వామివారి ప్రధాన ఆలయం, వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన హుండీలలో స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను స్వామివారి కల్యాణ మండపంలో బుధవారం లెక్కింపు ప్రక్రియను నిర్వహించారు. 127 రోజులకు గాను రూ.7,39,429 ఆదాయం వచ్చినట్లు ఈఓ తెలిపారు. హుండీ లెక్కింపు సందర్భంగా ఎస్సై టీవీఆర్ సూరి ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి అనిల్‌కుమార్, టీజీవీబి సిబ్బంది, మణుగూరుకు చెందిన శ్రీవారి సేవా సమితి బృందం, భక్తులు పాల్గొన్నారు.


