సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు
భూపాలపల్లి రూరల్: షిర్డీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకోని బుధవారం పట్టణంలోని కారల్ మార్క్స్‌కాలనీలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యేకు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు మహాన్నదానం నిర్వహించారు.


