పోలింగ్‌ సిబ్బందికి విధుల కేటాయింపు | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ సిబ్బందికి విధుల కేటాయింపు

Dec 4 2025 8:46 AM | Updated on Dec 4 2025 8:46 AM

పోలిం

పోలింగ్‌ సిబ్బందికి విధుల కేటాయింపు

పోలింగ్‌ సిబ్బందికి విధుల కేటాయింపు

ములుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్‌ సిబ్బందికి రెండవ విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియను చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ దివాకర, సాధారణ ఎన్నికల పరిశీలకుడు ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. ములుగులోని కలెక్టర్‌ చాంబర్‌లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్‌ జరిపించగా కలెక్టర్‌ నిశితంగా పరిశీలించారు. జిల్లాలోని మండలాల వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్‌, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్‌ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్‌ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్‌ ద్వారా కేటాయించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాండమైజేషన్‌ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్‌ విధుల కోసం ఎంపిక చేసినట్లు వివరించారు. జిల్లాలోని 146 గ్రామ పంచాయతీల సర్పంచ్‌, 1,290 వార్డు స్థానాలకు, 1,306 పోలింగ్‌ స్టేషన్లలో ఎన్నికల నిర్వహణ కోసం 20 శాతం రిజర్వ్‌ స్టాఫ్‌ కలుపుకుని ప్రిసైడింగ్‌ అధికారులతో పాటు, ఓపీఓల ర్యాండమైజేషన్‌ జరిగిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సంపత్‌ రావు, డీపీఓ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగులు సమాజానికి స్ఫూర్తి ప్రదాతలు

దివ్యాంగులు సమాజానికి స్ఫూర్తి ప్రదాతలని, ప్రపంచ వేదికపై మన దేశ కీర్తిని చాటిన ఘనత దివ్యాంగులదని వారితో ఆత్మీయంగా మెలగాలని కలెక్టర్‌ దివాకర సూచించారు. బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీసామాజిక పురోగతిని ముందుకు తీసుకెళ్లడానికి కలుపుకునే సమాజాన్ని రూపొందించడమనే నేపథ్యం్ఙలో జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్‌లో జిల్లా సంక్షేమ అధికారి తుల రవి అధ్యక్షతన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరై దివ్యాంగుల హక్కులు, అవకాశాలు సామాజిక బ్యాతలపై కలెక్టర్‌ వివరించారు. అనంతరం దివ్యాంగుల సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో పలు డిమాండ్లపై కలెక్టర్‌కు వినతిపత్రం అందించగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. జిల్లాలో దివ్యాంగులకు విద్య, ఆరోగ్యం, ఉపాధి, సామాజిక భద్రత రంగాల్లో వారికి సేవలు అందించేందుకు అంకితభావంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్‌ వివరించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మహేందర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నారు. సౌకర్యాలు కల్పించడం మన బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి రవి, డీఆర్‌డీఓ శ్రీనివాస్‌, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌, జిల్లా నాయకులు పూజరి మాణిక్యం, కనకం రాజు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ దివాకర, సాధారణ ఎన్నికల

పరిశీలకులు శ్రీకాంత్‌కుమార్‌

పోలింగ్‌ సిబ్బందికి విధుల కేటాయింపు1
1/1

పోలింగ్‌ సిబ్బందికి విధుల కేటాయింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement