షురూ..
న్యూస్‌రీల్
మొదటి విడతలో పోటీలో ఉండే అభ్యర్థుల వివరాలు
గురువారం శ్రీ 4 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ పూర్తి
ఏటూరునాగారం/ఎస్‌ఎస్ తాడ్వాయి: పల్లెల్లో ప్రచారం ఊపందుకుంది. జిల్లాలోని 9 మండలాల్లో మూడు దఫాలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏటూరునాగారం, ఎస్‌ఎస్ తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లో మొదటి విడత ఎన్నికల కోసం నామినేషన్లను గత నెల 27 నుంచి 29 స్వీకరించారు. తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కాగా ఎన్నికల బరిలో నిలిచిన సర్పంచులు, వార్డు సభ్యులకు గుర్తుల కేటాయింపు బుధవారం పూర్తైంది. దీంతో గ్రామ పంచాయతీల్లో ప్రచార జోరు మొదలైంది. అదే విధంగా పలు జీపీల్లో సర్పంచులు, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక రెండో విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా మూడో విడతలో ఎన్నికలు జరగనున్న వెంకటాపురం(కె), వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో ఆశావహులు తొలిరోజు నామినేషన్లు వేశారు.
గుర్తుల కేటాయింపు
సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ బుధవారం సాయంత్రంతో ముగిసింది. వివిధ పార్టీల నుంచి ఆశావహులు సర్పంచ్, వార్డు మెంబర్ల పోటీకి నామినేషన్ పత్రాలను సమర్పించగా పరిశీలన పూర్తి చేసిన అధికారులు నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం సాయంత్రం 3 గంటల వరకు గడువును నిర్ణయించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు వచ్చే నాటివరకు వివిధ పార్టీల ప్రధాన నాయకులు నామినేషన్ దాఖలు చేసిన వ్యక్తులతో బేరసారాలు నిర్వహించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో పోటీలో ఉండే సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులకు అధికారులు గుర్తులను కేటాయించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు గుర్తుల లీస్టును ప్రదర్శించడంతో గుర్తులు తెలుసుకునేందుకు అభ్యర్థులు పోటీ పడ్డారు. అనంతరం అభ్యర్థులు ప్రింటింగ్ ప్రెస్‌ల వద్దకు చేరుకుని తమకు కేటాయించిన గుర్తులతో కరపత్రాలు, వాల్ పోస్టర్లు తయారు చేయించుకుని ప్రచారాన్ని షురూ చేశారు. ఇదిలా ఉండగా ఏటూరునాగారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజ్‌కుమార్, ట్రైనీ ఎస్సై రచితతో పాటు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
ఏకగ్రీవ సర్పంచులు, వార్డు సభ్యులు వీరే..
ఏటూరునాగారం మండల పరిధిలోని శంకరాజుపల్లిలో 8 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు. అనూహ్యంగా ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన దేవులపల్లి విజయ్‌కుమార్ ఒక్కరు మాత్రమే బరిలో నిలిచారు. దీంతో పోటీదారులు ఎవరూ లేకపోవడంతో దేవులపల్లి విజయ్‌కుమార్ శంకరాజుపల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు రిటర్నింగ్ అధికారి రవిచంద్ర తెలిపారు. అదేవిధంగా ఏటూరునాగారం 13వ వార్డు ఆవుల అక్షయ వార్డు సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఆ వార్డులో చిన్నపల్లి దేవకి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో అక్షయ్య వార్డు సభ్యురాలిగా ఎన్నికై నట్లు రిటర్నింగ్ అధికారి రాజు తెలిపారు. అదే విధంగా ఎస్‌ఎస్‌తాడ్వాయి మండల పరిధిలోని అంకంపల్లి, నర్సాపూర్(పీఏ), పంబపూర్ జీపీలకు నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఒక్కొక్కరు మినహా మిగితా వారు ఉపసంహరించుకోవడంతో ఆయా గ్రామాల సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. అంకంపల్లి సర్పంచుగా ఇర్ప వెంకటేశ్వర్లు, పంబపూర్ సర్పంచుగా ముక్తి శ్రీను, నర్సాపూర్(పీఏ) సర్పంచుగా యాప కళ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో పాటు ఈ మూడు జీపీల్లోని వార్డు సభ్యులు కూగా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు అధికారులు వెల్లడించారు. ఎస్‌ఎస్ తాడ్వాయి గ్రామపంచాయతీలో 10 వార్డు అభ్యర్థి ఈసం ఆశోక్‌తో పాటు వెంగ్లాపూర్ జీపీలో నాలుగు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మండలం సర్పంచులు ఏకగ్రీవమైనవి బరిలో వార్డుల్లో..
నిలిచింది
ఎస్‌ఎస్‌తాడ్వాయి 18 3 52 239
ఏటూరునాగారం 12 1 41 234
గోవిందరావుపేట 18 05 52 283
సర్పంచ్, వార్డు సభ్యులకు గుర్తుల కేటాయింపు
పలు జీపీల్లో సర్పంచులు, వార్డు సభ్యుల ఏకగ్రీవం
షురూ..
షురూ..
షురూ..


