డయల్ యువర్ డీఎంకు విశేష స్పందన
ములుగు రూరల్: ఆర్టీసీ అధికారులు బుధవారం నిర్వహించిన డయల్ యువర్ డీఎం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా నుంచి మొత్తం 15 మంది ఫోన్ చేసినట్లు తెలిపారు. ఇందులో ఎక్కువగా పొట్లాపూర్‌కు బస్సు సర్వీస్ పెంచాలని, గట్టమ్మ పాయింట్ వద్ద బస్సు ఆపడం లేదని, బస్సులు సమయపాలన ప్రకారం నడిచేలా చూడాలని విజ్ఞప్తులు వచ్చినట్లు డీఎం రవిచందర్ తెలిపారు. త్వరలోనే ప్రయాణికుల సౌకర్యార్ధం సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ భవాని, కస్టమర్ రిలేషన్ కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.
సమ్మక్కసాగర్‌లో
చేపపిల్లల విడుదల
కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం గ్రామ పంచాయతీలో గల సమ్మక్క సాగర్‌బ్యారేజీలో మత్స్యశాఖ, పెసా, మొబలేజర్స్ ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి చేప పిల్లలను గోదావరిలో విడుదల చేసే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ఈ మేరకు బుధవారం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయకూడదనే ఆదేశాలు ఉన్నప్పటికీ లెక్కచేయకుండా చేప పిల్లలను గోదావరిలో వేస్తున్నారని పలువురు అధికారుల పై విమర్శలు చేస్తున్నారు.
‘సీఎం అనుచిత వ్యాఖ్యలు సరికాదు’
ములుగు రూరల్: హిందూ దేవతలపై సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ దేవతలపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించాలన్నారు. ఎంఐఎం పార్టీ మెప్పుకోసం హిందూ దేవతలను కించపరిచడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవీంద్రచారి, చింతలపూడి భాస్కర్ రెడ్డి, భూక్య రాజునాయక్, కొత్త సురేందర్, రమేష్, శోభన్, కృష్ణాకర్ రావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
అఖిల భారత్ పూర్వ సైనిక్ సేవ పరిషత్‌లో చేరిక
భూపాలపల్లి అర్బన్: రక్షణ శాఖ గుర్తింపు పొందిన ‘అఖిల భారత్ పూర్వ సైనిక్ సేవ పరిషత్’ లో జిల్లాలోని జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం మాజీ సైనికులు చేరినట్లు జిల్లా అధ్యక్షుడు అభిషేక్ తెలిపారు. గత రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన యూత్ ఫర్ నేషన్ కార్యక్రమానికి హాజరైన అఖిల భారత్ పూర్వ సైనిక్ సేవ పరిషత్ కేంద్ర అధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ వీకే చేతుర్వేది ఆధ్వర్యంలో చేరినట్లు ఆయన తెలిపారు. మాజీ సైనికుల సంక్షేమ కార్యక్రమాలను భవిష్యత్‌లో మరింత బలపరిచేందుకు జిల్లా మాజీ సైనికుల సంఘం అఖిల భారత్ పూర్వ సైనిక్ సేవ పరిషత్ సహకారంతో ముందుకు సాగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అభిషేక్ గుప్తా, ప్రధాన కార్యదర్శి దుబాసి సాగర్, మాజీ సైనికులు బేతోజు మురళీ కృష్ణ, సైనిక కుటుంబాలు పాల్గొన్నారు.
డయల్ యువర్ డీఎంకు విశేష స్పందన


