
పాఠశాలల బలోపేతానికి కృషి
వెంకటాపురం(ఎం): ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్‌జేడీ) సత్యనారాయణ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. ఈ మేరకు పాఠశాలలోని రికార్డులు, ఉపాధ్యాయుల హాజరు పట్టిక, మధ్యాహ్న భోజన రిజిస్టర్, బియ్యం స్టాక్‌ను పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు. విద్యార్థుల సామర్థ్యాలకు సంబంధించి నిర్వహించిన ఎల్‌ఐపీ ప్రోగ్రాం, ఎఫ్‌ఎల్‌ఎన్‌కు సంబంధించిన మూల్యాంకనం పేపర్లను తక్షణమే ఆన్‌లైన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ అర్షం రాజు, హెచ్‌ఎం రాధిక, ఉపాధ్యాయులు జనగాం బాబురావు, రాజయ్య, వేణు, సీఆర్‌పీ కుమార్‌పాడ్య తదితరులు పాల్గొన్నారు.
విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్
సత్యనారాయణ