
బీరన్నకు బోనాలు
ములుగు రూరల్: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదవ కులస్తులు బీరన్న స్వామికి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బుధవారం మహిళలు బోనాల ఆలయానికి బయలుదేరి వెళ్లి నైవేద్యం సమర్పించి యాటపోతులను బలిచ్చారు. కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కులపెద్దలు గొర్రె అంకూస్, ఇమ్మడి భిక్షపతి, కొనుపుల కుమార్, బైకాని ప్రకాశ్, బొంతల వేణు, గోపు చంద్రమల్లు, బైకాని సారయ్య, ఇమ్మడి శ్రీనివాస్, ఇమ్మడి రమేష్, మహిళలు పాల్గొన్నారు.
ప్రతీ విద్యార్థి
మొక్కలు నాటాలి
భూపాలపల్లి అర్బన్: పర్యావరణ సమతుల్యతలను కాపాడేందుకు ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మొక్కలు నాటాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల అవరణంలో సింగరేణి ఆధ్వర్యంలో మొక్కలు నాటి, విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి జీఎం ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మొక్కలు నాటే కార్యక్రమంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని కోరారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులు తిరుపతి, ఉపాధ్యాయులు కొమల, సరోత్తంరెడ్డి, రామకృష్ణ, రాజయ్య, సురేష్, విద్యార్థులు పాల్గొన్నారు.