
ఆదరణ బాగానే ఉంది..
బక్రీద్ పండుగ దృష్ట్యా ఆరు నెలల ముందునుంచే గొర్రె పోట్టేళ్లను పెంచుతాం. ఇవి ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచి ధర వస్తుంది. ప్రస్తుతం విక్రయాలతో ఆరునెలల కష్టానికి తగిన గిట్టుబాటు లభిస్తుంది.
– జక్కుల గట్టయ్య, మల్లక్పల్లి
ప్రతి ఏటా రెండు పొట్టేళ్లు కొంటాం
ఖర్చుకు వెనకాడకుండా ప్రతిఏటా బక్రీద్ పర్వదినంరోజుకు రెండు పొట్టేళ్లను కొంటాం. మూడు భాగాలు చేసి పంపిణీ చేస్తాం. ఈసారి ధరలు బాగానే ఉన్నాయి. ప్రతీ ముస్లిం విధిగా తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పొట్టేళ్లను కొనుగోలు చేసి మాంసం దానం చేస్తారు.
– సయ్యద్ యాకుబ్, కాజీపేట

ఆదరణ బాగానే ఉంది..