బిగ్‌బాస్‌ హౌస్‌లోకి నటి ఎంట్రీ.. వెంటబడ్డ కుక్కలు | Viral: Street Dogs Chased Rakhi Sawant While Entering Bigg Boss House | Sakshi
Sakshi News home page

Dogs Chasing Rakhi Sawant: వెరైటీ డ్రెస్‌.. వెంటబడ్డ కుక్కలు

Aug 23 2021 1:18 PM | Updated on Aug 23 2021 1:32 PM

Viral: Street Dogs Chased Rakhi Sawant While Entering Bigg Boss House - Sakshi

సాక్షి, ముంబై : వివాదాస్పద నటి రాఖీ సావంత్‌ బిగ్‌బాస్‌లో పాల్గొని యమ క్రేజ్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది వరకు కేవలం కాంట్రవర్సీ క్వీన్‌గానే గుర్తింపు పొందిన రాఖీ బిగ్‌బాస్‌ సీజన్‌14 అనంతరం మోస్ట్‌ ఎంటర్‌టైనర్‌గా ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంది. అయితే ఇటీవలె తనను మరోసారి బిగ్‌బాస్‌ సీజన్‌-15 ఓటీటీలోకి  సైతం తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపింది.

స్పైడర్‌ ఉమెన్‌ గెటప్‌ వేసి, ముంబై  వీధుల్లో తిరుగుతూ హల్‌ చల్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అమ్మడి డిమాండ్‌కి బిగ్‌బాస్‌ సైతం దిగొచ్చింది. దీంతో ఈ సీజన్‌ ఓటీటీలోనూ రాఖీకి అవకాశం కల్పించారు. దీంతో మామూలు కంటే కాస్త ఎక్కువగానే ముస్తాబైన రాఖీ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తుండగా ఆమెను కుక్కలు వెంబడించాయి. భారీ డ్రెస్‌తో కారు దిగి సెట్‌లోకి అడుగుపెడుతుండగా అక్కడే ఉన్న కుక్కులు ఆమెను వెంబడించాయి.

దీనికి సంబంధించిన వీడియోను రాఖీ సావంత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతుంది. అయితే అదృష్టవశాత్తూ అవి కరవలేదు. లేదంటే హౌస్‌ కంటే ముందు ఆమె హాస్పిటల్‌కి వెళ్లాల్సి వచ్చేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా హిందీ బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో ఒకసారి పాల్గొన్న కంటెస్టెంట్లకు మరో సీజన్‌లోనూ పాల్గొనే అవకాశం ఉందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ సీజన్ వూట్‌ జరుగుతుండగా.. కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించనున్నాడు.

చదవండి : మెగా అభిమానం : క్యూబ్స్‌తో 6.5 ఫీట్ల చిరు ఫోటో
సీక్రెట్‌గా హీరో కార్తికేయ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటో వైరల్‌
Bigg Boss: షాకింగ్‌.. ‘బిగ్‌బాస్‌’ కోసం నడి రోడ్డుపై నటి హల్‌చల్‌

Advertisement
 
Advertisement
Advertisement