Shah Rukh Khan: రామ్ చరణ్‌పై ‘కింగ్ ఖాన్’ ఆసక్తికర వ్యాఖ్యలు

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన లేటెస్ట్ మూవీ పఠాన్ మూవీ ప్రమోషన్సలో భాగంగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించాడు. ట్విటర్ వేదికగా ఆస్క్‌షారుక్‌ఖాన్(#AskSRK) పేరుతో లైవ్‌చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు కింగ్ ఖాన్ సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో ఓ నెటిజన్లు రామ్ చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పండి అని షారుక్‌ను కోరాడు. దీనికి షారుక్ స్పందిస్తూ.. ‘చరణ్ నా ఓల్డ్ ఫ్రెండ్.. నా పిల్లలకు తనంటే చాలా ఇష్టం’ అని చెప్పుకొచ్చాడు.
చదవండి: హీరోయిన్ల రెమ్యునరేషన్‌పై మృణాల్ షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఆర్‌ఆర్‌ఆర్ మూవీ చరణ్ పాన్ ఇండియా స్టార్ మారిపోయాడు. ఈ చిత్రంలో ప్రపంచవ్యాప్తంగా విశేషమైన ఫ్యాన్‌డమ్‌ను సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే గతంలో చరన్ జంజీర్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం షారుక్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కతోన్న జవాన్ మూవీలో నటిస్తున్నాడు. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.
చదవండి: సావిత్రి గురించి షాకింగ్ విషయం చెప్పిన సీనియర్ నటి ఝాన్సీ
He is an old friend and very loving to my kids https://t.co/LlLU9lHM0T
— Shah Rukh Khan (@iamsrk) December 17, 2022