లిప్‌లాక్‌ సీన్‌, బయటపడ్డ సల్మాన్‌ మోసం!

Salman Khan Has Not Dropped His No kiss Policy - Sakshi

కంటికి కనిపించేదంతా నిజం కాదు.. 'అరుంధతి' సినిమాలోలో నాజర్‌ అనుష్కకు చెప్పే డైలాగ్‌ ఇది. నిజమే.. సినిమాల్లో కనిపించేందంతా నిజమే అని చెప్పలేం. ముఖ్యంగా హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ చాలావరకు నటనే ఉంటుంది. కానీ అన్ని సన్నివేశాల్లో చాలా సహజంగా, అవలీలగా నటించేస్తారు. అయితే కొందరు హీరోహీరోయిన్లు మాత్రం లిప్‌లాక్‌ సీన్లలో నటించబోం అని కండీషన్లు కూడా పెడతారు. అందులో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఒకరు.

30 ఏళ్లకు పైగా కెరీర్‌లో ఒక్కసారి కూడా హీరోయిన్‌కు ముద్దు పెట్టని ఈ హారో తాజాగా 'రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌' సినిమాలో మాత్రం తన హద్దును తనే చెరిపేసుకున్నాడు. దిశా పటానీకి లిప్‌లాక్‌ ఇచ్చినట్లు ట్రైలర్‌లో చూపించారు. అయితే ఈ కండల వీరుడు తన పాలసీకి కట్టుబడి ఉన్నారని కొందరు అభిమానులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. రాధే ట్రైలర్‌లో చూపించిన ముద్దు సన్నివేశం ఫేక్‌ అని తేల్చారు. ఆ సీన్‌ను స్క్రీన్‌సాట్‌ తీసి జూమ్‌ చేసి చూస్తూ హీరోయిన్‌ నోటికి ప్లాస్టర్‌ వేసి ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

కాగా ప్రభుదేవా దర్శకత్వం వహించిన యాక్షన్‌ సినిమా 'రాధే'లో జాకీ ష్రాఫ్‌, రణ్‌దీప్‌ హుడా ముఖ్య పాత్రల్లో నటించారు. మే 13న ఈ చిత్రం ఓ వైపు థియేటర్లలో, మరోవైపు ఓటీటీలో విడుదలవుతోంది. అయితే ఓటీటీలో పే పర్‌ వ్యూ విధానంలో అందుబాటులోకి రానుంది.

చదవండి: 'సల్మాన్‌ ఆ రొమాన్స్ ‌ఆఫ్-స్క్రీన్‌లో చేస్తాడు..అందుకే'..

కమెడియన్‌ చేసిన పనికి నెటిజన్ల ప్రశంసలు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top