Niharika's Husband Chaitanya Jonnalagadda Post After 4 Months Of Silence - Sakshi
Sakshi News home page

Chaitanya Jonnalagadda: సైలెన్స్ బ్రేక్.. నాలుగు నెలల తర్వాత తొలి పోస్ట్

Jul 1 2023 2:03 PM | Updated on Jul 1 2023 3:03 PM

Niharika Husband Chaitanya Post After 4 Months Silence - Sakshi

మెగాడాటర్ నిహారిక అధికారికంగా చెప్పనప్పటికీ ప్రస్తుతం భర్తకు దూరంగానే ఉంటుంది. ఈ మధ్యే వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరగ్గా.. ఈ వేడుకలో నిహారిక ఉంది తప్పితే, ఈమె భర్త చైతన‍్య ఎక్కడా కనిపించలేదు. దీంతో వీళిద్దరూ విడాకులు తీసుకున్నారని అందరూ అంచనాకు వచ్చేశారు. ఇప్పుడు చైతన్య తన ఇన్ స్టాలో సంచలన పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది?

నిహారిక-చైతన్య వివాదం
మెగాడాటర్ నిహారిక గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిందేం లేదు. 'ముద్దపప్పు ఆవకాయ' సిరీస్ తో చాలా ఏళ్ల క్రితమే నటిగా కెరీర్ ప్రారంభించింది. 'ఒక మనసు' సినిమాతో హీరోయిన్ అయింది. 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' తదితర చిత్రాల్లోనూ నటించింది. చిరంజీవి 'సైరా'లో అతిథి పాత్రలో మెరిసింది. 2020 డిసెంబరులో చైతన్య జొన్నలగడ్డని పెళ్లి చేసుకుంది. ఓ రెండేళ్లపాటు ఈ జంట బాగానే ఉంది. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ ఇన్ స్టా అకౌంట్స్‌లో ఇద్దరూ కలిసున్న ఫొటోలని డిలీట్ చేశారు.

(ఇదీ చదవండి: తెలుగు యువ నటుడు మృతి.. విడుదలకి ముందే విషాదం)

విడాకులు నిజమేనా?
నిహారికతో పాటు ఆమె భర్త చైతన్య.. తమ ఇన్ స్టా ఖాతాల‍్లో కలిసున్న ఫొటోలని తీసేశారు. దీంతో విడాకుల న్యూస్ బయటకొచ్చింది. ఓవైపు నిహారిక నటిస్తూ బిజీ అయిపోగా.. చైతన్య బయటఎక్కడా కనిపించలేదు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా లేడు. ఫిబ్రవరి 15న ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. దాదాపు నాలుగు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడే ఓ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం మహారాష్ట్రలోని ఓ మెడిటేషన్ సెంటర్ లో ఉన్నట్లు ఫొటోలు చూస్తే అర్ధమవుతోంది. 

పోస్ట్ లో ఏముంది?
'ఈ స్థలం, నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను. గత 10 రోజులుగా నా జీవితంలోకి వచ్చిన విపాసన ప్రక్రియ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్. మనం ఓ చోటుకి ఎలాంటి అంచనాల్లేకుండా వెళ్లి, అద్భుతమైన జ్ఞానంతో తిరిగొస్తుంటాం. ఇది అలాంటిదే' అని చైతన్య రాసుకొచ్చాడు. ముంబయిలోని గ్లోబల్ విపాసన పగోడా అనేది ఓ మెడిటేషన్ సెంటర్. ప్రస్తుతం చైతన్య అక్కడే ఉన్నాడు. ఇదే విషయాన్ని బయటపెట్టాడు.


(ఇదీ చదవండి: డిప్రెషన్ బారిన పడ్డా.. ఆ విషయం బయటపెట్టిన కాజల్!)

Advertisement
 
Advertisement
Advertisement