
రామ్ అగ్నివేష్,రాజీవ్ కనకాల, బాహుబలి ప్రభాకర్, చిత్రం శీను నటించిన తాజా చిత్రం ఇక్షు.పద్మజ పద్మజ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై డా.హన్మంత్ రావు నాయుడు నిర్మించిన ఈ చిత్రానికి వివి ఋషిక దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా ఐదు భాషల్లో పోస్ట్ ప్రొడక్షన్ ముగించుకోగా తాజాగా మొదటి ప్రీమియర్ ను కూడా ప్రదర్శించారు.వివి ఋషిక ఈ సినిమాతో దర్శకురాలిగా అరంగేట్రం చేశారు.
ఈ సినిమా తమిళ,మలయాళ థియేట్రికల్ హక్కులను ప్రముఖ సంస్థ సొంతం చేసుకుంది. ఓటీటీ హక్కుల కోసం జీ5 సహా నెట్‌ఫ్లిక్స్ సంస్థలతో చర్చలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ కానుంది.